తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషనల్ గా మారిన నటుడు నరేష్ పవిత్ర లోకేష్ జంట. వీరిద్దరూ ఈ వయసులో రిలేషన్ లో ఉండడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే రిలేషన్ లో ఉండటమే కాకుండా పెళ్లి కూడా చేసుకుంటాము అంటూ నరేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాక రేపుతున్నాయి.. ఇక వీరిద్దరూ మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు.ఈ సినిమా మిశ్రమ స్పందన ను దక్కించుకుంది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు నరేష్ పవిత్ర లోకేష్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు.
ఇక ఈ సినిమాలో నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా లిప్ లాక్ పెట్టుకున్న సన్నివేశం ఏవిధంగా హైలైట్ అయిందో మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ వీడియోని విడుదల చేయడంతో అప్పట్లో పెద్ద ఎత్తున ఈ వీడియో సంచలనంగా అయితే మారింది. అయితే ఈ వీడియోలో పవిత్ర లోకేష్ లిప్ లాక్ పెట్టడం వెనుక చాలా కష్టం ఉందని నరేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ లిప్ లాక్ వెనుక ఉన్నటువంటి స్టోరీని బయటపెట్టారని తెలుస్తుంది.. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశం పెట్టడం కోసం పవిత్ర నన్ను చాలా ఇబ్బంది పెట్టిందని తెలిపారు. సినిమాలో లిప్ లాక్ సన్నివేశం ఉండబోతుందని చెప్పగానే ఒక్కసారిగా పవిత్ర లోకేష్ షాక్ అయిందని అంతేకాకుండా తాను ఈ సన్నివేశంలో నటించనని తెగేసి చెప్పిందని తెలిపారు. అయితే ఆమెను ఈ సన్నివేశంలో నటించమని తనని మూడు రోజులపాటు బ్రతిమలాడానని ఇలా తీవ్రంగా బ్రతిమలాడటంతో చివరికి ఈ సన్నివేశంలో నటించడానికి ఆమె ఒప్పుకుంది అంటూ ఈ సందర్భంగా లిప్ లాక్ సన్నివేశం వెనుక ఉన్నటువంటి స్టోరీని నరేష్ తెలిపారు.ఇలా ఈ సన్నివేశంలో నటించడానికి పవిత్ర లోకేష్ వెనకడుగు వేసిన కూడా సినిమా ప్రమోషన్లలో మాత్రం బహిరంగంగా వేదికపైనే ఇద్దరు ఒకరిపై మరొకరు ముద్దుల వర్షం కురిపించుకున్న సంగతి అందరికి తెలిసిందే.