Nepal Political Crisis: నేపాల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అరెస్ట్స్.. మాజీ ప్రధాని ఓలీ, మాజీ హోం మంత్రి అరెస్ట్!
- ఖాట్మండు పాలిటిక్స్‌లో పెను సంచలనం
- ఓలీ సామ్రాజ్యానికి బాలెన్ షా చెక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Political Crisis: నేపాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన 24 గంటల్లోనే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రధానమంత్రి బాలెన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ, మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీతో పాటు మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్‌లను అరెస్ట్ చేసింది. గతంలో జరిగిన ‘జెన్-జి’ నిరసనల్లో విద్యార్థుల మరణాలకు వీరిద్దరే బాధ్యులని ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
READ ALSO: Off The Record : అంబటి రాంబాబు పెద్ద ప్లానింగ్ లో ఉన్నాడా..?
Also Read
అరెస్టులకు దారితీసిన కారణాలు ఇవే..
ప్రధాని బాలెన్ షా అధ్యక్షతన జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలోనే విచారణ కమిషన్ నివేదికను అమలు చేయాలని నిర్ణయించారు. నిరసనల సమయంలో నిరాయుధులైన విద్యార్థులపై కాల్పులు జరపడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారని, దీనికి అప్పటి పాలకులే బాధ్యులని నివేదిక స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రత్యక్ష చర్యలకు ఉపక్రమించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఈ రోజు తెల్లవారుజామున ముందుగా మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని కూడా అరెస్ట్ చేశారు. ఈ ఆకస్మిక పరిణామాలు నేపాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.
తదుపరి చర్యలు..
ఈ మరణాల్లో పోలీసు, సాయుధ దళాలు, సైన్యానికి చెందిన కొంతమంది అధికారుల ప్రమేయం ఉన్నట్లు కమిషన్ నివేదిక పేర్కొన్నప్పటికీ, వారిపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారుల పాత్రపై లోతైన దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని సమాచారం.
READ ALSO: Telangana: కీలక అలర్ట్.. ఆ జిల్లాలో మార్చి 28న బంద్.. కారణం ఇదే..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!