బెల్లంకొండ సురేష్ రెండవ తనయుడు బెల్లంకొండ గణేశ్ స్వాతిముత్యం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు.. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమా మంచి విజయం సాధించింది.. ఈ హీరో నటించిన రెండో సినిమా నేను స్టూడెంట్ సర్.అల్లరి నరేష్ నాంది సినిమాను నిర్మించిన సతీష్ ఈ మూవీని నిర్మించారు.ఉప్పలపాటి రాఖీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జూన్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ సినిమా తో అలనాటి తార భాగ్య శ్రీ కూతురు అయిన అవంతిక తెలుగు తెరకు పరిచయమైంది. అయితే థియేటర్లలో మిక్డ్స్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధం అయింది.ఈ సినిమాను ఈ నెల 14న నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా ప్రకటించింది. మరో రెండు రోజుల్లో నేను స్టూడెంట్ సర్ ఆహా ఓటీటీ ప్లాట్ ఫాం లో స్ట్రీమింగ్ కానుంది..
ఈ సినిమాలో విలక్షణ నటుడు అయిన సముద్రఖని ముఖ్య పాత్రను పోషించారు. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా కథ ఏమిటంటే..సుబ్బు అలియాస్ సుబ్బారావు ఫోరెన్సిక్ స్టూడెంట్. వివేకానంద యూనివర్సిటీలో చదువుతుండే అతనికి ఐఫోన్ అంటే ఎంతో ఇష్టం. ఎంతో కష్టపడి రూ.90 వేలు కూడబెట్టుకొని మరీ ఐఫోన్ 12 సిరీస్ కొనుక్కుంటాడు. దానికి బుచ్చిబాబు అని పేరును పెట్టుకొని తన సొంత తమ్ముడిలా చూసుకుంటుంటాడు. ఓరోజు కాలేజీలో జరిగిన విద్యార్థుల గొడవల విషయంలో అందరితో పాటు సుబ్బును కూడ పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ సమయంలో వారు విద్యార్థులందరి నుంచి ఫోన్స్ తీసుకుంటారు.అయితే ఆ తర్వాత తన ఫోన్ తీసుకునేందుకు స్టేషన్ కు వెళ్లగా సుబ్బుకు తన ఫోన్ దొరకదు. దాన్ని స్టేషన్లోనే పోలీసులే కొట్టేశారని అనుమానించిన సుబ్బు.. వారిపై కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తాడు.కమిషనర్ అర్జున్ వాసుదేవన్ వద్దకు వెళ్లగా అతను ఫిర్యాదు తీసుకునేందుకు అస్సలు అంగీకరించడు. దీనితో ఆ ఫోన్ ను హీరో ఎలా సాధిస్తాడు అనేది కథ.థియేటర్ లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ లో అయినా మంచి టాక్ తెచ్చుకుంటుందో లేదో చూడాలి.