NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీని ప్రకటించిన ఎన్టీఏ
- జూన్ 21, ఆదివారం దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్ష నిర్వహణ
- ప్రశ్నపత్రం లీక్, అవకతవకల ఆరోపణలతో పరీక్ష రద్దు
- అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేసిన ఎన్టీఏ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET UG 2026: దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్రబిందువైన నీట్ (NEET) యూజీ 2026 పరీక్షపై కీలక అప్డేట్ వెలువడింది. ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకల ఆరోపణలతో రద్దైన ఈ పరీక్షను తిరిగి నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కొత్త తేదీని ప్రకటించింది. జూన్ 21, ఆదివారం దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ అధికారికంగా వెల్లడించింది.
ఈ మేరకు ఎన్టీఏ తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేసింది. పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం, అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల వివరాలను త్వరలో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. విద్యార్థులు అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను విశ్వసించవద్దని చెప్పుకొచ్చింది.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. మే 3న నిర్వహించిన పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పలుచోట్ల నిరసనలు వ్యక్తమవ్వగా, కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం, పరీక్షా సంస్థలపై ఒత్తిడి పెరిగింది.
తాజాగా గురువారం అర్థరాత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో కీలక సమావేశం జరిగినట్లు సమాచారం. సుదీర్ఘ చర్చల అనంతరం రీ-ఎగ్జామ్ తేదీపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ అనుమతి అనంతరం ఎన్టీఏ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అధికారుల ప్రకారం, రీ-ఎగ్జామ్ ద్వారా విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి పరీక్ష నిర్వహణలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రశ్నపత్రాల రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఇక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా పరిశీలించాలని, అడ్మిట్ కార్డు విడుదల తేదీ, పరీక్ష సమయం వంటి వివరాలను ముందుగానే తెలుసుకోవాలని అధికారులు సూచించారు.
📢 NEET (UG) 2026 — परीक्षा तिथि की घोषणा
राष्ट्रीय परीक्षा एजेंसी ने भारत सरकार की स्वीकृति से NEET (UG) 2026 की पुनः-परीक्षा रविवार, 21 जून 2026 को आयोजित करने का निर्णय लिया है।
परीक्षार्थियों एवं अभिभावकों से अनुरोध है कि वे केवल NTA के आधिकारिक माध्यमों पर ही विश्वास करें।…— National Testing Agency (@NTA_Exams) May 15, 2026
తాజావార్తలు
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!