సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయిందని పేర్కొన్నారు. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయని. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్నారని తీవ్రంగా విమర్శించారు.
ఏపీలో SSC పరీక్షల్లో మాస్ కాపీయింగ్, పరీక్ష పేపర్ల లీకేజీకి సంబంధించి బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని SSC ఎగ్జామినేషన్ డైరెక్టర్ దేవానంద రెడ్డి ఎన్టీవీతో చెప్పారు. ఇప్పటి వరకు పేపర్ లీక్ కాలేదన్నారు. పరీక్ష ప్రారంభం అయ్యాక క్యశ్చన్ పేపర్ షేర్ అయింది. ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్‌ఛార్జ్ లే దీనికి సహకరిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఏపీ వ్యాప్తంగా మాస్ కాపీయింగ్ కి సహకరిస్తున్న 55 మందిని అరెస్ట్ చేసాం అన్నారు దేవానంద్ రెడ్డి. అందులో 35 మంది ప్రభుత్వ…