Site icon NTV Telugu

NEET Score Scam: ముంబైలో వెలుగు చూసిన నీట్ స్కోర్ బాగోతం.. రూ. 90 లక్షలు డిమాండ్!

Neet

Neet

ముంబైలో నీట్ స్కోర్ బాగోతం వెలుగు చూసింది.. నీట్ స్కోర్ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసింది.. నీట్ స్కోర్ లను తారుమారు చేస్తామంటూ డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇద్దరు తల్లిదండ్రుల నుంచి రూ. 90 లక్షల వసూలు చేసినట్లు తెలిసింది. నిందితులు మహారాష్ట్రలోని సోలాపూర్, నవీ ముంబైకి చెందిన సందీప్ షా, సలీం పాటిల్ ను అరెస్ట్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) కల్పిత అధికారులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి నీట్ అభ్యర్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. నీట్ యుజి 2025లో తక్కువ స్కోర్ సాధించిన అభ్యర్థుల మార్కులను తారుమారు
చేయవచ్చని బాధితులకు హామీ ఇచ్చి డబ్బులు వసూలు చేశారు.

READ MORE: Trivikram Srinivas : గురూజీ ముందు జాగ్రత్త.. మిగతా డైరెక్టర్లు నేర్చుకోవాలా..?

సీబీఐ అధికారుల సమాచారం ప్రకారం.. అధికారులు తల్లిదండ్రులుగా నటిస్తూ నిందితుడు సందీప్ షాను లోయర్ పరేల్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో కలిశారు. ఈ సమావేశంలో షా పలువురి తల్లిదండ్రుల నుంచి రూ.90 లక్షలు డిమాండ్ చేశాడు. బేరసారాలు ఆడి చివరకు ఒక్కో అభ్యర్థికి రూ.87.5 లక్షలకు కుదించారు. NEET-UG 2025 పరీక్షలో అర్హత సాధించడానికి అవసరమయ్యే స్కోర్‌లను సాధించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారుల సహాయంతో ప్రయత్ని్స్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో తల్లిదండ్రుల రూపంలో ఉన్న సీబీఐ అధికారులు సందీప్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తదుపరి దర్యాప్తులో సలీం పటేల్, జావేద్ అలీ పటేల్ ప్రమేయం కూడా ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం సలీ, సందీప్ షాను అరెస్ట్ చేశారు.

READ MORE: Vijay Rupani: రెండుసార్లు ఫ్లైట్ టికెట్ క్యాన్సల్.. మూడోసారి మృత్యువు ఒడిలోకి..

Exit mobile version