Neeraj Chopra: పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. ఫోటోలు వైరల్
- వివాహం చేసుకున్న నీరజ్ చోప్రా
- పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్
- సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నీరజ్ పెళ్లి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా ఆదివారం వివాహం చేసుకున్నారు. అతను తన కుటుంబంతో కలిసి కనిపించిన వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నీరజ్ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ట్విట్టర్ లో పెళ్లి ఫోటోలను పోస్ట్ చేశారు. దానికి నీరజ్-హిమాని అని క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాకుండా.. “జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను” అని రాశారు.
Read Also: CM Chandrababu: ముఖ్యమంత్రి దావోస్‌కు పయనం.. ఆల్ ది బెస్ట్ చెప్పిన అధికారులు
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రాను జావెలిన్ త్రోలో ప్రపంచంలోనే అత్యుత్తమ పురుష అథ్లెట్‌గా అమెరికన్ మ్యాగజైన్ ‘ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్’ 2024లో ప్రకటించింది. 2024 ఒలింపిక్ గేమ్స్‌లో పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన నీరజ్.. కాలిఫోర్నియాకు చెందిన మ్యాగజైన్ 2024 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను 89.45 మీటర్లు విసిరాడు. నీరజ్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ జావెలిన్ 92.97 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని సాధించాడు.
Read Also: Sambhal violence: సంభాల్ హింసలో మరో 10 మంది అరెస్ట్.. దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధం..
గతంలో నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. నీరజ్ పెళ్లి కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. సోషల్ మీడియా నుంచి ఇంటర్వ్యూల వరకు పెళ్లి గురించి ప్రశ్నలు అడిగారు. అయితే పెళ్లిపై నీరజ్ ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. తాజాగా.. ఈరోజు పెళ్లి చేసుకుని తన అభిమానులను ఆశ్చర్యపరిచారు.
जीवन के नए अध्याय की शुरुआत अपने परिवार के साथ की। 🙏
Grateful for every blessing that brought us to this moment together. Bound by love, happily ever after.
नीरज ♥️ हिमानी pic.twitter.com/OU9RM5w2o8
— Neeraj Chopra (@Neeraj_chopra1) January 19, 2025
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!