Site icon NTV Telugu

Telangana: నేడు రాష్ట్రానికి ఎన్డీఎస్‌ఏ కమిటీ.. మేడిగడ్డలో పర్యటన

Ndsa Committee

Ndsa Committee

Telangana: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA) నిపుణుల కమిటీ నేడు(బుధవారం) రాష్ట్రానికి రానుంది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం, లోపాలపై అధ్యయనం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 13న తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎన్డీఎస్‌ఏకు లేఖ రాశారు. ఈ క్రమంలో ఈ నెల 2న కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) మాజీ ఛైర్మన్‌ జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో ఆరుగురితో ప్రభుత్వం కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ హైదరాబాద్‌కు చేరుకున్నాక బుధవారం మధ్యాహ్నం జలసౌధలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఇతర అధికారులతో ఎన్డీఎస్‌ఏ కమిటీ సమావేశం కానుంది.

Read Also: MP Laxman: మోడీని విమర్శించే వారంతా వారి కుటుంబం కోసం మాత్రమే పని చేస్తున్నారు..

7, 8 తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనుంది. మళ్లీ 9వ తేదీన హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ఆయా బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులు, నిర్మాణ సంస్థలతో సమావేశం కానుంది. ఆ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో బ్యారేజీల ప్లానింగ్‌, డిజైన్లు, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్‌, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓ అండ్‌ ఎం) అధికారులు తమ వెంట ఉండేలా చూడాలని సర్కారును కోరింది. మేడిగడ్డ కుంగుబాటుపై కమిటీ విచారణ చేపట్టనుంది.

Exit mobile version