రాష్ట్రపతి ఎన్నికలకు ముందు జూలై 17న సాయంత్రం దేశ రాజధానిలో ఎన్డీయే నేతలు సమావేశం కానున్నారు. జూలై 18న జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఈ సమావేశం జరగనున్నుట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో ఎన్డీయే నేతల వ్యూహంపై సవివరమైన చర్చ జరుగుతుందని సమాచారం.
ఈ సమావేశంలో ఎన్‌డీఏలోని ఉభయ సభలకు చెందిన ఎంపీలందరికీ ఎన్నికల్లో పాల్గొనే విధానాన్ని వివరిస్తామని, మొత్తం ప్రక్రియకు సంబంధించిన మాక్ డ్రిల్‌ను కూడా నిర్వహించి సభ్యులకు చూపించనున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్డీయే ఎంపీల సమావేశం అనంతరం విందు ఉంటుంది.
Parliament Sessions: కొవిడ్ నిబంధనల మధ్య వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు
రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము తన అభ్యర్థిత్వం కోసం జూన్ 24న నామినేషన్ దాఖలు చేశారు. ముర్ము భారతదేశ చరిత్రలో మొదటి ప్రధాన గిరిజన మహిళా రాష్ట్రపతి అభ్యర్థి. ఒకసారి ఎన్నికైన తర్వాత, ఆమె భారతదేశపు మొదటి గిరిజన రాష్ట్రపతిగా గుర్తింపు పొందనున్నారు. ఆమె ఒడిశా నుంచి మొదటి రాష్ట్రపతి అభ్యర్థి కాగా.. ఆమె ఎన్నికైతే ఒడిశా నుంచి ఎన్నికైన మొదటి రాష్ట్రపతి కానుంది. ఎన్డీయే మిత్రపక్షాలతో పాటు ఎన్‌డీఏ అభ్యర్థి ముర్ముకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్, బీజేడీ,అకాలీదళ్, ఇతర పార్టీల మద్దతు కూడా ఉంది.
