NBK111 : బాలయ్య – గోపించంద్ మలినేని – తమన్ ఈసారి సౌండ్ అదిరిపోద్ది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో 111వ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి మాస్ జాతర చేయడానికి సిద్ధమవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అఖండ మొదలుకొని అఖండ 2 వరకు.. బాలయ్య అంటే బాక్సులు బద్దలయ్యే మ్యూజిక్ ఇస్తున్న తమన్.. మరోసారి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడానికి రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే రెండు పవర్‌ఫుల్ ట్యూన్స్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్స్ మాస్ ఆడియన్స్‌ను ఊగిస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఓ పవర్‌ఫుల్ సాంగ్ కోసం ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించినట్టుగా తెలిసింది. బాలయ్య ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన రాసిన లిరిక్స్, తమన్ మ్యూజిక్‌కు థియేటర్లు షేక్ అవడం గ్యారెంటీ అని అంటున్నారు. త్వరలోనే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ పాట చిత్రీకరణ ప్రారంభం కానుందట. ఇందుకోసం చిత్ర బృందం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం. పాటతో పాటు అదే లొకేషన్‌లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారట. బాలకృష్ణ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈసారి కూడా బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఎన్బీకె 111లో మామూలుగా ఉండదని అంటున్నారు. మరి గోపిచంద్ మలినేని ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!