లేడీ బాస్ నయనతార గురించి అందరికీ తెలుసు.. తెలుగు, తమిళ్ చిత్రాల్లో వరుస సినిమాల్లో నటించడంతో పాటుగా హీరోలతో సమానంగా అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్ కూడా నయనే కావడం విశేషం.. ఇకపోతే ఈ మధ్య ఈ అమ్మడు ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ఇష్టపడుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చిన మూవీ.. ‘అన్న పూరణి’…
ప్రముఖ దర్శకుడు నీలేశ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. సినిమా విడుదల సమయంలో చెన్నైలో వరదలు రావడం వల్ల ‘అన్న పూరణి’ మూవీపై ఎలాంటి టాక్ రాలేదు. ఇక తాజాగా ఈమూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.. అలాగే పలు వివాదాలను కూడా అందుకుంటుంది..
కాగా, ఈ సినిమాలో జీవితంలో ఒక లక్ష్యం.. పట్టుదల ఉంటే ఎలాంటి అవాంతరాలనైనా దాటుకుని అనుకున్నది సాధించవచ్చనే ఉద్దేశ్యంతో’ ఈ మూవీ తెరకెక్కించారు. కానీ, డైరెక్టర్ అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి అన్నట్లు అయింది. ఈ మూవీలో సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన యువతిని అలా చూపించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఇందులో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని, లవ్ ను ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్ఛారని గత కొన్ని రోజులుగా పెద్ద చర్చలు కూడా జరుగుతున్నాయి.. మాజీ శివసేన నేత రమేష్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్నపూరణి సినిమాకు సంబంధించిన నిర్మాతలు, డైరెక్టర్, హీరోయిన్ నయనతార, అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఇలా ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు… మరి ఈ సినిమా వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి..