టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ టీం.. తాజాగా హన్మకొండలో ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించింది. ఇందులో భాగంగా నవీన్ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ‘నాకు సినీ నేపథ్యం (ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్) లేదని అందరూ అంటుంటారు, కానీ నాకు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. నా వెనుక కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు వినోదాన్ని పంచడమే నా లక్ష్యం’ అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. తన గత సినిమాలు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ చిత్రాలను ప్రేక్షకులు ఎలాగైతే ఓన్ చేసుకున్నారో, ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Also Read : Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్’ పై ఉపాసన రివ్యూ..!
దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. కాగా ‘ప్రతి సీన్ నవ్వులు పూయించేలా ఉంటుంది, ఫ్యామిలీతో కలిసి హాయిగా ఎంజాయ్ చేసే పక్కా పండగ సినిమా ఇది’ అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపేసిన నవీన్, సినిమా విడుదల తర్వాత అమెరికాలో కూడా సందడి చేయనున్నారు. సంక్రాంతి రేసులో ఇప్పటికే విడుదలైన ‘మన శంకర వర ప్రసాద్ గారు’,‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మంచి హిట్ అందుకోగా ‘అనగనగా ఒక రాజు’ ఎలాంటి నవ్వుల విందు భోజనం వడ్డిస్తుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
