ఈ సరి జరిగిన లోక్ సభ ఎన్నికలు ఎవరికీ అంతు చిక్కపట్టలేదు. ఒడిశా రాష్ట్రంలో గత రెండు దశాబ్దాలకు పైగా పాలిస్తున్ననవీన్ పట్నాయక్ కంచుకోటాని బీజేపీ బద్దలుకొట్టింది. ఒడిశాలో దాదాపు 24 ఏండ్ల పాటు ఏకచత్రాధిపత్యం చెలాయించిన రాష్ట్ర సీఎం, బిజూ జనతా దళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ జైత్ర యాత్రకు బ్రేక్ పడింది. ఒడిశాలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ బీజేపీ ఆధిక్యం కనబరిచింది. రాష్ట్రంలో మొత్తం 21 లోక్‌సభ స్థానాలు ఉండగా ఎన్నడూ లేని విధంగా ఏకంగా 19 స్థానాల్లో కమలం పార్టీ విజయం సాధించింది. రాష్ట్రంలోని అధికార బీజేడీ కేవలం ఒక్క స్థానానికే పరిమితం కాగా, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక్క సీటుతోనే సరిపెట్టుకొన్నది. మంగళవారం విడుదలైన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బిజూ జనతాదళ్ పరాజయం పాలైంది.