NTV Telugu Site icon

National Turmeric Board : నేడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం.. నిజామాబాద్‌ వేదికగా కార్యకలాపాలు..

National Turmeric Board

National Turmeric Board

నేడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం కానుంది. వర్చువల్‌గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి హాజరుకానున్నారు. ఇందూరు(నిజామాబాద్‌)లో లోనే పసుపు బోర్డు ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ఉన్న రీజినల్ స్పైసెస్ బోర్డు కార్యాలయంలోనే నేటి నుంచి జాతీయ పసుపు బోర్డు కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

READ MORE: Kaushik Reddy Arrest: కౌశిక్ రెడ్డి అరెస్ట్ కేసులో రాత్రంతా హైడ్రామా, హైఅలర్ట్..

ఇదిలా ఉండగా..సోమవారం సాయంత్రం ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ నేపథ్యంలో పసుపు రైతులకు సంక్రాంతి కానుకగా కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. మంగళవారం నుంచి నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. పసుపు బోర్డు తెలుగు రాష్ట్రాలకే కాదని.. యావత్తు దేశానికి అందిస్తుందన్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ దీన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

READ MORE: Supreme Court: రేపు మధురాలో కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంపై సుప్రీం విచారణ..

సంక్రాంతి అంటేనే రైతుల పండుగ.. గ్రామాల పండుగ అన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఈ తరం మరిచిపోకుండా.. పండుగ నాడు తమ స్వస్థలాలకు వెళ్లి మరీ జరుపుకోవడం శుభసూచకం అన్నారు. ఢిల్లీలో తొలిసారి తన నివాసంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రధాని మోడీ, స్పీకర్ ఓంబిర్లా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కవులు, కళాకారులు పాల్గొన్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు.

Show comments