National Flag: జాతీయ జెండా దేశానికి అత్యంత కీలకమైన వాటిలో ఒకటి. అది ఆ దేశ గౌరవ చిహ్నం. త్రివర్ణ పతాకాన్ని ప్రతి సంవత్సరం ప్రత్యేక రోజులలో, స్వాతంత్య్ర & గణతంత్ర దినోత్సవాలలో కూడా ఎగురవేస్తారు. అంతేకాకుండా, భారతదేశం దేశభక్తి, ప్రతిష్టను ప్రదర్శించడానికి వివిధ సందర్భాలలో జాతీయ జెండాను ఉపయోగిస్తారు. ఇటీవల ప్రతి ఇంటిపై హర్ ఘర్ తిరంగా నినాదంతో జాతీయ జెండా రెపరెపలాడుతోంది. అయితే, జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రత్యేక నియమాలు వర్తిస్తాయి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. రాజ్యాంగం నిర్దేశించిన ఫ్లాగ్ కోడ్ ను తప్పనిసరిగా పాటించాలి.
CommitteeKurrollu: అదరగొడుతున్న కమిటీ కుర్రోళ్ళు 5 రోజుల కలక్షన్స్ ఎంతంటే..?
ఇకపోతే జాతీయ జెండాను ప్రభుత్వ భవనాలపై, ప్రభుత్వ అధికారులు మాత్రమే ఎగురవేయడానికి అనుమతించారు. 2001లో సుప్రీంకోర్టు నవీన్ జిందాల్ వేసిన కేసులో ఎవరైనా పౌరుడు జెండా ఎగురవేయడానికి అనుమతించే విధంగా చట్టాన్ని మార్చారు. జాతీయ జెండా రక్షణకు సంబంధించి 1950, 1971 నాటి చట్టాలు, అలాగే 2002, 2005లో చేసిన సవరణలు కొత్త జాతీయ జెండా కోడ్‌ను ఏర్పాటు చేశాయి. ఈ నియమంలో భాగంగా, జెండా భూమిని, నీటిని తాకకూడదు. ఇంకా వేదిక ముందు.. అలాగే టేబుల్‌క్లాత్ గా కూడా ఉపయోగించకూడదు. జెండాను ఉద్దేశపూర్వకంగా తలకిందులుగా చేయకూడదు.
YSRCP: జాతీయ ఎస్సీ కమిషన్‌ను కలిసిన వైసీపీ బృందం.. విజయవాడ ఘటనపై ఫిర్యాదు
విగ్రహాలు లేదా ఇతర వస్తువులపై వేలాడదీయకూడదు. జెండా దిగువ నడుము వద్ద లేదా లోదుస్తులపై ఉపయోగించబడదు. జెండాను ఆవిష్కరించే సమయంలో, జెండాలో పూవులు తప్ప మరేదైనా ఉంచడం లేదా దానిపై ఏదైనా రాయడం నిషేధించబడింది. సాధారణంగా, జెండాను సూర్యోదయం సమయంలో ఎగురవేయాలి. అలాగే సూర్యాస్తమయం సమయంలో దించాలి. నిలువుగా వేలాడదీసినప్పుడు.., కాషాయం రంగు చూసేవారికి ఎడమ వైపున ఉండాలి. అలాగే మురికిగా ఉన్న జెండా ఎగరవేయకూడదు. X ఆకారపు స్తంభాలపై రెండు జాతీయ జెండాలను ఎగురవేసినప్పుడు, రెండు జెండాలను వ్యతిరేక దిశల్లో ఎగురవేయాలి. పోడియంలు, భవనాలను కవర్ చేయడానికి లేదా రెయిలింగ్‌లను అలంకరించడానికి జెండాలను వాడకూడదు.