మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఇంగ్లాండ్ అదరగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ జట్టు నటాలియా సీవర్ ( 42 బంతుల్లో 50) అద్భుత హాఫ్ సెంచరీకి తోడు చివర్లో అమీ జోన్స్ (27 బంతుల్లో 40) రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 స్కోరు చేసి భారత్ ముందు 152 పరుగుల టార్గెట్ ఉంచింది. కాగా, ఇన్నింగ్స్ ప్రారంభంలోనే టీమిండియా పేసర్ రేణుకా సింగ్ ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించింది. మొదటి ఓవర్లోనే డేనియల్ వ్యాట్ (0)ను ఔట్ చేసిన రేణుక.. వరుస స్పెల్స్‌లో అలైస్ క్యాప్సే (3), సోఫీ డంక్లే (10)ను పెవిలియన్ పంపి భారత క్యాంప్‌లో ఆనందం నింపింది. అనంతరం కెప్టెన్ హీథర్ నైట్ (28)తో కలిసి నటాలియా సీవర్ గొప్పగా బ్యాటింగ్ చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా సమయోచితంగా ఆడుతూ టీమ్ స్కోర్‌ను ముందుకు నడిపింది. ఈ క్రమంలోనే నాలుగో వికెట్‌కు 51 రన్స్ జోడించాక హీథర్‌ను శిఖా పాండే ఔట్ చేసింది. ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాక సీవర్ కూడా పెవిలియన్ చేరింది. ఇక చివర్లో అమీ జోన్స్ మెరుపులతో ఇంగ్లాండ్ మంచి స్కోరు సాధించింది.
Also Read: MS Dhoni: ధోనీ గ్యారేజీలోకి కొత్త బైక్.. టీవీఎస్ రోనిన్ ప్రత్యేకతలు ఇవే!