Nasha MuktBharat: డ్రగ్స్ మహమ్మారిపై సమరశంఖం.. ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు కింగ్ నాగార్జున మద్దతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nasha MuktBharat: యువత బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్న మత్తుపదార్థాల మహమ్మారిని తరిమికొట్టేందుకు సినీ, రాజకీయ రంగాలు ఏకమవుతున్నాయి. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘నషా ముక్త్ భారత్ యాత్ర’ (హైదరాబాద్ వాక్)కు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ మహా ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని నాగార్జునను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి యాత్రకు సంబంధించిన టీ-షర్టులను ఆవిష్కరించారు.
సమాజాన్ని, ముఖ్యంగా యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ రక్కసిని అంతమొందించడం మనందరి సామాజిక బాధ్యతని అక్కినేని నాగార్జున అన్నారు. ఆరోగ్యకరమైన, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం జరిగే ఇలాంటి గొప్ప కార్యక్రమాలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన “నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్” పిలుపు మేరకు, 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృఢ సంకల్పంతో ఈ యాత్రను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భావితరాల భద్రత కోసం నిర్వహిస్తున్న ఈ మహా యజ్ఞంలో యువత, తల్లిదండ్రులు, నగర ప్రజలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Also Read
- Punjab: ఒక్కసారిగా కూలిన ఇనుప వంతెన.. కాలువపై చిక్కుకున్న రెండు భారీ లారీలు
- Can Beer Damage Your Kidneys: బీర్ తాగితే కిడ్నీలకు ఏం కాదనుకుంటున్నారా? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు..
- WhatsApp New Update: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. కొత్త ఫీచర్ వివరాలివే!
- Hyderabad: అండాల దందా.. ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ల రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు..
తాజావార్తలు
-
Nasha MuktBharat: డ్రగ్స్ మహమ్మారిపై సమరశంఖం.. ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు కింగ్ నాగార్జున మద్దతు..
-
PM Modi: 50 కోట్ల మంది పేదరికాన్ని జయించారు.. రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ స్ట్రాంగ్ కౌంటర్!
-
Punjab: ఒక్కసారిగా కూలిన ఇనుప వంతెన.. కాలువపై చిక్కుకున్న రెండు భారీ లారీలు
-
January 12 Vidudala: ప్రమోషన్స్ అంటే చాలు వచ్చేస్తాడు.. అనిల్ రావిపూడిపై కృతి, కీర్తి సెటైర్లు!
-
B2B UPI Payment Charges: వ్యాపార లావాదేవీలపై రూ.5 ఛార్జీ?.. NPCI కొత్త ప్రతిపాదన ఇదే!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!