రోజు రోజుకు ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాణాలు తీవ్రంగా పడిపోయాయి. ఇక, బంగాళాఖాతం వరకు పొగమంచు కమ్ముకుంది అని నాసా పేర్కొంది. నాసా విడుదల చేసిన ఫోటోలలో వరల్డ్‌వ్యూ ఉపగ్రహం యొక్క చిత్రాలలో, పాకిస్తాన్ నుంచి బంగాళాఖాతం వరకు పొగమంచు కనిపిస్తుంది. అయితే, ఇది ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మాత్రమే ఎక్కువగా ప్రభావితమవుతుంది అని నాసా వెల్లడించింది. ఇక్కడ గాలి నాణ్యత సూచిక చాలా తీవ్రమైన స్థితిలో ఉంది పేర్కొంది. ఇది కూడా ఆందోళన కలిగిస్తుంది.. ఎందుకంటే మితిమీరిన కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది చెప్పింది. నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. కాలుష్యం ఊపిరితిత్తులు, గుండె మరియు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇందులో అత్యధిక సంఖ్యలో PM 2.5 కణాలు ఉన్నాయి.. ఇవి శ్వాసతో శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
Read Also: PM MODI: దీపావళికి దేశ ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి.. నమో యాప్‌లో సెల్ఫీలు పెట్టాలని సూచన
ఇక, ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ అత్యంత తీవ్రమైన స్థాయికి చేరుతుండటంతో ఇప్పటికే ఢిల్లీలోని స్కూళ్లకు స్వచ్ఛందంగా కేజ్రీవాల్ ప్రభుత్వం హాలీడేస్ ప్రకటించింది. వాహనాల సరి-బేసి పద్ధతి కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తూ నాసా కొన్ని ఛాయాచిత్రాలు విడుదల చేసింది. పంజాబ్ నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించిన ఒక దట్టమైన పొర క్లీయర్ గా మనకు కనిపిస్తోంది.
Read Also: Top Headlines@9AM: టాప్ న్యూస్
తాజాగా, దీపావళికి ముందు దేశ రాజధానిలోని ఏ ప్రాంతం కూడా పీల్చడానికి సరిపోవడం లేదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ (గురువారం) ఉదయం గాలి నాణ్యత స్థాయి 504 దాటింది అని ఢిల్లీలోని NCR తెలిపింది. ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 504గా నమోదు అవుతుంది. ఇక, జహంగీర్‌పురిలో 437, నోయిడాలో 415, ఫరీదాబాద్‌లో 324గా నమోదు అయింది. అయితే, ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 432, ఆర్‌కె పురంలో 453, పంజాబీ బాగ్‌లో 444 తో పాటు ITOలో 441గా నమోదు అయింది.