Naga Manikanta Likely To Be Eliminated In Seventh Week of Bigg Boss 8 Telugu : తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-8 సెప్టెంబర్ 1న మొదలై ఆక్తికరంగా నడుస్తోంది. రోజు రోజుకు పలు ట్విస్టులతో ప్రేక్షకాదరణను పెంచుకుంటోన్న ఈ షోలో సరికొత్త ట్విస్టులు ఇస్తూ జనాలను అయోమయంలో పడేస్తున్నారు. ఇటీవల అన్ని సీజన్లకు చెందిన కొందరు మాజీ కంటెస్టెంట్స్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి మరింత ఇంట్రెస్ట్ పెంచారు. అలాంటి ఈ బిగ్‌బాస్-8 మరికొద్ది గంటల్లో ఏడో వారం పూర్తి చేసుకుని 8వ వారంలోకి అడుగుపెట్టనుంది. చూస్తుండగానే వీకెండ్ వచ్చేసింది. అయితే ప్రతి వారం ఎవరో ఒకరు కచ్చితంగా ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బయటకు రావాల్సిందే. ఈ క్రమంలో ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారోనని ప్రేక్షకులు టెన్షన్‌లో ఉన్నారు.
NTR Devara 2: ఈసారి అంతకు మించి.. ఆ స్టార్స్ కూడా?
అయితే ఆదివారం ఎలిమినేషన్ ఉండగా ఒకరోజు ముందుగానే ఆదివారం ఎపిసోడ్ షూట్ చేయడంతో ఆ విషయాలు లీక్ అవుతున్నాయి. ఆ ప్రకారం ఒక షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వారం హరితేజ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, నబీల్ అఫ్రిది, టేస్టీ తేజా, నాగ మణికంఠలతో కలిపి మొత్తం 9 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఎవరు బయటకు వెళతారు అనేది అర్థం కాక అంతా అయోమయంలో పడ్డారు. ఈ నేపథ్యంలో.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం నాగ మణికంఠ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఓటింగ్ శాతం తక్కువగా రావడంతో మణికంఠ హౌస్ నుంచి బయటకు రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చేది ఎవరు? అని కన్ఫర్మ్ కావాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.