Site icon NTV Telugu

Dy.CM Narayana Swamy : రాష్ట్రంలో జగన్ మాత్రమే బీసీల పక్షపాతి

Narayanaswamy

Narayanaswamy

పూతలపట్టులో జరిగిన రోడ్దు ప్రమాదంలో మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. ఆయన స్థానిక ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, ఎంఎస్ బాబులు ఉన్నారు. అయితే.. ప్రభుత్వం తరపున మృతులకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 1 లక్ష ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. అంతేకాకుండా.. సాయంత్రంలోపు కలెక్టర్ ద్వారా చెక్కులు అందేలా నారాయణ స్వామి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీల నయవంచకుడని ఆరోపించారు.
Also Read : Bandi Sanjay: బీజేపీ అధికారం లోకి వస్తే.. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక పాలసీ

శవాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు జరిపేవాడు చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. తన స్వార్ధం, తన లబ్ది కోసం ఎవ్వరితోనైనా చేతులు కలిపే వ్యక్తి చంద్రబాబు అని ఆయన విమర్శించారు. మోడీపై బూతులు మాట్లాడి ఇప్పుడు మోడీ వెనుక వెంపర్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా సోనియాను ఇటలీ మహిళ అని దూషించి, ఆమెతో కలిసి పోటీ చేసాడని ఆయన ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో జగన్ మాత్రమే బీసీల పక్షపాతి అని, బీసీల కోసమే పుట్టాడని, బీసీల కోసం నిరంతరం పోరాటాలు చేసిన ఆర్.కృష్ణయ్య లాంటివేరే చెబుతున్నారన్నారు.
Also Read : Firing-Hiring: ప్రపంచవ్యాప్తంగా ఫైరింగ్‌ వేళ.. ఇండియాలో హైరింగ్‌ హేల..

Exit mobile version