Vyooham: ‘వ్యూహం’ సినిమాకు ఆర్జీవి కి షాక్ ఇచ్చిన సివిల్ కోర్ట్..రిలీజ్ కష్టమే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘వ్యూహం’. రీసెంట్ గా ఈ సినిమాకు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ వచ్చినట్లు ఆర్జీవి తెలిపారు. అర చేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఎవరూ ఆపలేరు.. ఈ సినిమా డిసెంబర్ 29 న విడుదల కాబోతుందని తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.వ్యూహం చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని అందులో ఆయన కోరారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మరియు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మలను ప్రతివాదులుగా చేర్చారు.వ్యూహం సినిమా విడుదల కాకుండా నిర్మాతను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 26న ఆ పిటిషన్ విచారణకు రానుంది.
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి అంటే ఇష్టమని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ తనకు నచ్చరని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. తన ఇష్టాయిష్టాలతో సినిమాలోని పాత్రలను నిర్ణయించుకున్నారు. చంద్రబాబును సినిమాలో తప్పుగా చూపించారు. ట్రైలర్‌లో చూపించిన విధంగానే సినిమా మొత్తం ఉండే అవకాశం ఉంది. 70ఏళ్ల జీవితంలో చంద్రబాబు నిబద్ధత, పారదర్శకతతో ఉన్నారు. ఈ సినిమాతో ఆయన్ను అపఖ్యాతి పాలుజేసే రాజకీయ శత్రువైన జగన్‌కు లబ్ధిపొందేలా చూస్తున్నారు. వాక్‌స్వాతంత్య్రం పేరుతో దర్శక, నిర్మాతలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. వీరి చర్యల వల్ల చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలగడంతో పాటు పార్టీ గౌరవం కూడా దెబ్బతింటోంది. వంగవీటి, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి చిత్రాల వల్ల దర్శక నిర్మాతలకు ఎలాంటి లాభాలు రాలేదు. అయినా మరోసారి అలాంటి సినిమానే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు నష్టాలు వస్తాయని తెలిసినా కేవలం జగన్‌కు లాభం కలగడం కోసం ఈ సినిమాను తీశారు. జగన్‌మోహన్ రెడ్డి వెనక ఉండి ఈ సినిమాను తీయించారు” అని నారా లోకేష్ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజాగా ఈ పిటీషన్ పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఓటీటీ, ఆన్లైన్ వేదికలలో విడుదల చేయవద్దని ఆదేశిస్తూ, ఆర్జీవి,నిర్మాణ సంస్థ రామదూత క్రియేషన్స్ కు నోటీసులు ఇచ్చింది.తదుపరి విచారణ ఈ నెల 27 కు వాయిదా వేసింది.
Also Read
తాజావార్తలు
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
-
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
-
Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?