Paradise: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్లో ఈ క్రేజీ కాంబినేషన్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. నేచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా ‘ది పారడైజ్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి మేకర్స్ వదులుతున్న అప్డేట్స్ నాని ఫ్యాన్స్‌తో పాటు, సినిమా లవర్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి.
READ ALSO: AP Inter Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ ఇదే!
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, నాని ఫస్ట్ లుక్ ‘జడల్’గా రస్టిక్ అవతార్‌తో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు ఈ సినిమా మేకర్స్ మరో బిగ్ సర్ప్రైజ్ను రివీల్ చేశారు. ఈ చిత్రంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కీ రోల్లో కనిపించనున్నట్లు తెలియజేస్తూ.. ఈ చిత్ర డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల స్వయంగా ట్విట్టర్లో పోస్టర్ రిలీజ్ చేశారు. “సంపూర్ణేష్ బాబు ఇకపై ఫన్నీ కాదు.. ‘బిర్యానీ’గా జడల్ స్నేహితుడిగా కనిపించనున్నాడు” అని ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టర్లో కనిపిస్తున్న సంపూర్ణేష్ బాబు గెటప్ చూస్తే సినిమా అభిమానులు షాక్ అవ్వల్సిందే. ఈ పోస్టర్లో కనిపిస్తున్న సంపూర్ణే్ష్ బాబు గెటప్ గమనిస్తే.. గెడ్డం, రఫ్ లుక్, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్తో ఈ సినిమాలో ఆయనది మామూలు కామెడీ రోల్ కాదని స్పష్టం చేస్తోంది. ఈ సినిమా 1980ల నేపథ్యంలో జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు టాక్ నడుస్తుంది. గతంలో ఈ సినిమా గురించి నాని మాట్లాడుతూ.. ఇండియన్ వెర్షన్ ఆఫ్ ‘మ్యాడ్ మ్యాక్స్’ అని అన్నారు. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘షికంజా మాలిక్’గా పవర్ఫుల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 26, 2026న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.
Sampoornesh Babu won't be FUNNY anymore.@sampoornesh as 'BIRYANI' – Jadal's friend… 🤗🤗#TheParadise pic.twitter.com/zUJ3G0zpgk
— Srikanth Odela (@odela_srikanth) December 19, 2025
READ ALSO: Champion: ‘భైరాన్‌పల్లి’లో బందూకు పట్టిన ‘ఛాంపియన్’..