తెలుగు ఇండస్ట్రీ లో ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీ ట్రెండ్ నడుస్తోంది. సీనియర్ హీరోల తో యంగ్ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.దీనితో యంగ్ హీరోలకు కూడా బాగా పాపులరిటీ వస్తుంది.అయితే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే మాత్రం ఆ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు నిరూపించాయి. ఆర్ఆర్ఆర్ సినిమా లో రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. ఈ సినిమా గ్లోబల్ వైడ్ గా అద్భుత విజయం సాధించింది.తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ, నేచురల్ స్టార్ నాని.. ఇద్దరు కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ లో నటించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.. బాలకృష్ణపై తనకున్న అభిమానాన్ని నాని ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నాడు.
ఇదివరకు నాని నటించిన కృష్ణ గాడి వీరప్రేమ గాధ సినిమాలో బాలయ్య అభిమానిగా నాని అద్భుతంగా నటించాడు.. బాలయ్య హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ వేదిక పై నాని బాలయ్య పై వున్న అభిమానాన్ని వివరించాడు. దీనితో బాలయ్య అభిమానులు నాని, బాలయ్య కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలనీ కోరుకున్నారు.బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ తో బాలయ్య చాలా బిజీ గా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలోనే బాలకృష్ణ-నాని కాంబినేషన్ లో సినిమా తీయాలనే ఆలోచన దర్శకుడు అనిల్ రావిపూడికి వచ్చినట్లు సమాచారం.అలాగే బాలయ్యకు అనిల్ స్టోరీ లైన్ కూడా వినిపించినట్లు సమాచారం. భగవంత్ కేసరి తర్వాత అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయనున్నట్లు సమాచారం..చిరు తో సినిమా పూర్తి కాగానే అనిల్ రావిపూడి నాని – బాలయ్య కాంబోలో మల్టీస్టారర్ మూవీ తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నట్లు సోషల్ మీడియా లో ఈ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.