నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’.. ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. యువ దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. పాటలతోనే ‘హాయ్ నాన్న’ సినిమాకు మంచి క్రేజ్ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన రెండు పాటలు బాగా పాపులర్ కాగా.. అమ్మాడి అనే మూడో పాటను మేకర్స్ నవంబర్ 4 న రిలీజ్ చేశారు. ఈ పాట లాంచ్ కోసం హైదరాబాద్‌లోని ఓ కాలేజీ లో ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా హీరో నాని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.పెద్ద దర్శకులతో ఎందుకు సినిమాలు చేయడం లేదు అని నానిని ఓ స్టూడెంట్ ప్రశ్నించారు. “అన్నా.. నువ్వు అనుకుంటే పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేయవచ్చు. కానీ ఎందుకు కొత్త డైరెక్టర్లతో వర్క్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు” అని అతడు .. నానిని ప్రశ్నించారు. దీనికి నాని అదిరిపోయే ఆన్సర్ చెప్పారు.”మీరు అనుకుంటే ఇంకా పెద్ద హీరో సినిమాకే వెళదామనే వెయిట్ చేయవచ్చు. నా కోసమే ఎందుకు వస్తున్నారు థియేటర్‌కు. మన మనసుకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్లిపోతున్నాం. మనసుకు నచ్చిన సినిమాలు మీరు చూస్తున్నారు. నేనూ అంతే” అని నాని చెప్పారు.
దీంతో ఆ ప్రశ్న అడిగిన స్టూడెంట్ సూపర్ అన్నా అని బదులు ఇచ్చాడు..కొత్త డైరెక్టర్లతో పని చేయడం తన మనసుకు నచ్చుతుందని నాని చెప్పారు.కాగా, హాయ్ నాన్న సినిమాలోని ‘సమయమా’ పాటకు స్టూడెంట్లతో కలిసి హీరో నాని, మృణాల్ ఠాకూర్ స్టేజీపైనే డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.హాయ్ నాన్న చిత్రం నుంచి వచ్చిన అమ్మాడి అనే మెలోడియస్ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది… ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే హాయ్ నాన్న నుంచి వచ్చిన సమయమా, గాజు బొమ్మ అనే పాటలు మంచి పాపులర్ అయ్యాయి. ఇప్పుడు అమ్మాడి పాట కూడా ఆకట్టుకుంటుంది ఈ అమ్మాడి పాటను కాలభైరవ, శక్తి శ్రీగోపాలన్ పాడారు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్‌ను హేషమ్ అద్భుతంగా కంపోజ్ చేసారు…హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7వ తేదీన తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. వైరా క్రియేషన్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి మరియు వీజేందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.