Nandini Reddy: “నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి..” పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandini Reddy: వెండితెరపై ఎమోషన్స్‌ని, బంధాలలోని సున్నితత్వాన్ని ఎంతో అందంగా పండించే దర్శకురాలు నందిని రెడ్డి. ‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తాజాగా NTV పాడ్‌క్యాస్ట్ లో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత జీవితం, పెళ్లి చేసుకోకపోవడం, ఒంటరితనంపై ఎవరూ ఊహించని విధంగా స్పందించారు. 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా లైఫ్ లీడ్ చేయడంపై నందిని రెడ్డి చాలా ఓపెన్ గా మాట్లాడారు.
పెళ్లి ఎందుకు చేసుకోలేదు?
“లైఫ్ లో పెళ్లి అనేది ‘డూ ఆర్ డై’ అనే రూల్ ఏమీ లేదు. నా మెంటాలిటీకి సింక్ అయ్యే పర్సన్ నాకు దొరకలేదు. నేను నచ్చిన వాళ్లతో నాకు సింక్ అవ్వలేదు. అందుకే పెళ్లి చేసుకోలేదు. మా ఇంట్లో వాళ్లు కూడా నన్ను ఎప్పుడూ పెద్దగా బలవంతం పెట్టలేదని నందిని రెడ్డి వివరించారు.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే:
ఒంటరితనం (Loneliness) వేధించట్లేదా? అనే ప్రశ్నకు ఆమె జనాల కళ్లు తెరిపించే సమాధానం ఇచ్చారు. “లైఫ్ బాగుండాలి అంటే కేవలం మొగుడు, పెళ్లాం అనే బంధం ఒక్కటే సరిపోదు. జీవితంలో ఎన్నో బంధాలు ఉండాలి. మీ బరువు బాధ్యతలను స్నేహితులు, అన్నదమ్ములు, చెల్లెళ్లు, పేరెంట్స్, కొలీగ్స్ ఇలా చాలా మంది మోస్తారు. నా చుట్టూ నేను బిల్డ్ చేసుకున్న అద్భుతమైన రిలేషన్స్ ఉన్నాయి. నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే, మిగతా అన్నీ ఉన్నాయి. నేను ఎప్పుడూ లోన్లీగా ఫీల్ అవ్వలేదు” అని స్పష్టం చేశారు.
ఆస్తులపై వ్యామోహం లేదు:
ఆస్తులు కూడబెట్టడంపై తనకు పెద్దగా ఆసక్తి లేదని చెప్తూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ‘ఓ బేబీ’ లాంటి పెద్ద హిట్ కొట్టాక కూడా నా అకౌంట్లో కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. నాకు ఫైనాన్షియల్ ప్లానింగ్ అస్సలు తెలియదు. దాంతో నా ఫ్రెండ్ ఒకరు నన్ను తిట్టి, దెప్పి పొడిచి, బలవంతంగా ఒక ఫ్లాట్ కొనిపించింది. నేనేమో 3 కోట్ల రూపాయల పైమాట ఉన్న ఆ ఫ్లాట్ డబ్బులు ఎలా కట్టాలో తెలియక భయపడ్డాను. కానీ లక్కీగా అప్పుడే కోవిడ్ రావడం, పేమెంట్లు స్లో అవ్వడంతో ఎలాగోలా కట్టగలిగాను” అని నవ్వుతూ చెప్పారు. ఆస్తుల కోసం గొడవలు పడటం వృధా అని, కొన్ని లక్షలు వదిలేస్తే ప్రశాంతత దొరుకుతుందంటే వదిలేయడమే మేలని ఆమె అన్నారు.
4 కుక్కలతో హ్యాపీ లైఫ్:
తనకు నాన్-ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఎక్కువని.. ఫిల్మీ పార్టీలకు తాను అస్సలు వెళ్లనని నందిని రెడ్డి చెప్పారు. శని, ఆదివారాలు ఇంట్లో ఒంటరిగా ఉండటం నాకు చాలా ఇష్టం. నాకు నలుగురు కుక్కలు ఉన్నాయి.. వాటితోనే నా కాలక్షేపం. ఇల్లు క్లీన్ చేసుకోవడం, వంట చేయడం, బుక్స్ చదవడం, మ్యూజిక్ వినడమే నా లైఫ్. నా మెంటల్ పీస్ కి అడ్డుపడే వ్యక్తి అయినా.. సిట్యుయేషన్ అయినా.. నా లైఫ్ నుండి కట్ చేసేస్తానని తన సింపుల్ అండ్ బోల్డ్ లైఫ్ ఫిలాసఫీని తెలిపారు.
తాజావార్తలు
-
US Iran Conflict: మిడిల్ ఈస్ట్‌లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
-
Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్ 55 ఏళ్ల ప్రయాణం వెనుక అసలు సీక్రెట్ ఇదే!
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!