Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..

  • నందిగ్రామ్ ఉప ఎన్నికకు TMC అభ్యర్థిగా సంచిత ప్రధాన్ డే ఎంపిక..
  • ఉద్యోగం కోల్పోయిన టీచర్‌ను బరిలోకి దింపిన మమతా బెనర్జీ..
  • పోటీకి దూరంగా ఉన్న తృణమూల్ అధినేత్రి..
Tmc

Tmc

Nandigram Bypoll:  పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చేందుకు మమతా బెనర్జీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపించాయి. నందిగ్రామ్ అసెంబ్ల ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ ఊహాగానాలకు తెరదించుతూ.. తృణమూల్ కాంగ్రెస్ నందిగ్రామ్ ఉప ఎన్నిక అభ్యర్థిగా సంచిత ప్రధాన్ డేను ప్రకటించారు. 15 ఏళ్ల తర్వాత తొలిసారి మమతా బెనర్జీ బెంగాల్ అసెంబ్లీలో లేకుండా పోయారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తృణమూల్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి అంతర్గత పోరు పెరిగింది. దీంతో ఆమె పార్టీపై పట్టు నిలుపుకునేందుకు మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చని అంతా అనుకున్నారు.

అయితే, ఆదివారం మమతా బెనర్జీ తన వర్గానికి చెందిన అభ్యర్థిగా సంచిత ప్రధాన్ డేను ప్రకటించారు. రీజి నగర్ నియోజవర్గ అభ్యర్థిగా ఆలం చౌధురిని ప్రకటించారు. సంచిత నందిగ్రామ్ బోయల్ ప్రైమరీ స్కూట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన వివాదం కారణగా ఆమె ఓ దశలో ఉద్యోగాన్ని కోల్పోయారు. టీచర్ల నియామకాలకు సంబంధించిన కేసులో 26,000 మంది టీచర్ల నియామకాలను రద్దు చేసిన నేపథ్యంలో సంచిత కూడా ఉద్యోగం కోల్పోయిన వారిలో ఉన్నారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆమెకు తిరిగి ఉద్యోగం లభించింది.

2008 నుంచి టీఎంసీతో అనుబంధం ఉన్న సంచిత, 2018-23 మధ్య పంచాయతీ సమితి సభ్యురాలిగా పనిచేనశారు. ఉద్యోగం కోల్పోయిన ఒక మాజీ ఉద్యోగిగా ఇప్పుడు ఆమె నందిగ్రామ్ పోరులో నిలుస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం సువేందు అధికారి నందిగ్రామ్‌తో పాటు మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. భవానీపూర్‌లో మమతను ఓడించారు. మరోవైపు నందిగ్రామ్‌లో కూడా గెలిచారు. ఈ నేపథ్యంలో నందిగ్రామ్‌కు రాజీనామా చేసి, భవానీపూర్‌ ఎమ్మెల్యేగా కొనసాగిందుకు నిర్ణయించుకున్నారు. దీంతో ఇప్పుడు నందిగ్రామ్ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.