NTV Telugu Site icon

Balakrishna: చంద్రబాబు మీద కక్ష సాధింపు చర్యే

Balakrishna

Balakrishna

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై కేసు పెట్టడానికి ముందే ప్లాన్ చేశారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం.. అవినీతి జరిగిందని చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.. ప్రతిపక్ష నేతపై కక్ష సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రభుత్వం. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారు.. బాబును జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ స్కామ్‌ను క్రియేట్ చేశారు.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ మొదట గుజరాత్‌లోనే అమలైంది.. గుజరాత్‌లో చూసే ఏపీలో అమలు చేయాలనుకున్నారు.. స్కామ్‌లో ప్రేమ్ చంద్రారెడ్డి పేరు ఎక్కడా ఎందుకు లేదు అని బాలకృష్ణ ప్రశ్నించారు.

Read Also: Tamilnadu: ఆవును చంపిందని పులిపై ప్రతీకారం తీర్చుకున్న రైతు.. ఏం చేశాడంటే?

చట్టాలు అతిక్రమించి కేసులు పెడితే.. చూస్తు ఊరుకోమని బాలకృష్ణ అన్నారు. ప్రజలు తిరగబడాలి, ఉద్యమించాలి.. చంద్రబాబు అరెస్ట్ తో ప్రాణాలు కోల్పోతున్న కుటుంబాలను త్వరలోనే పరామర్శంచడానికి వెళ్తా.. కష్టకాలంలో ఉన్న పార్టీ కోసం నేను ముందు ఉండి పోరాడతాను అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యం లా బయటకు వస్తాడు.. ఎన్ని కేసులు పెట్టినా భయ పడేది లేదు.. ప్రజా పక్షాన పోరాటం కొనసాగుతుంది.. మాది మాటిస్తే మాట తప్పని పార్టీ టీడీపీ.. అధికారంలో ఉంటే సేవా చెయ్యాలన్న మనసు ఉండాలి అని బాలకృష్ణ అన్నారు.

Read Also: Uttarakhand: నేపాలీ మహిళతో ఆర్మీ అధికారి డేటింగ్.. పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు….

అప్పులు చేసి పాలన చేయడం సరికాదు.. ఆ అప్పుల భారం ప్రజలే మోయాల్సి ఉంటుంది అని నందమూరి బాలకృష్ణ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. టీడిపి ప్రభుత్వంలో యువత ప్రపంచంతో పోటీ పడిన పరిస్థితి.. ఇప్పటి ప్రభుత్వం ఉపాధి అవకాశాలను ధ్వంసం చేసి యువతను నిర్వీర్యం చేస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలుగు వాడికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు.. తెలుగు వారి గౌరవం కోసం ఎన్టీఆర్ టీడీపీనీ స్థాపిస్తే తెలుగు ప్రజల అభివృద్ధి కోసం చంద్రబాబు పోరాటం చేశారు అని బాలకృష్ణ చెప్పారు.

Read Also: Bigg Boss 7 Telugu : ఈ వారం నామినేషన్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసా?

ప్రజలు ఆలోచన చేయాలి.. మనహక్కుల కోసం పోరాటం చేయాలి అని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఆంధ్ర పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది.. చేతులు ముడుచుకొని కూర్చునే రోజులు పోయాయి.. సీఎం జగన్ కి అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు.. తెలంగాణకు ధీటుగా ఆంధ్రను అభివృద్ధి చేయాలన్న చంద్రబాబు ఆలోచనకి జగన్ ఆలోచనలకు పోలిక లేదు.. ప్రజలు పోరాటానికి సిద్దమవ్వాలి అని ఆయన అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేని దుస్థితిలో ఉన్నాము.. రాష్ట్రం టాక్సులతో బాధపడే స్థితికి వచ్చింది.. భవిష్యత్ లో ఆధారాలు లేని కేసులు చాలా పెడతారు.. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి.. జగన్ ఎందుకు విదేశాలకు వెళ్ళాడో చెప్పాలి అని బాలకృష్ణ డిమాండ్ చేశారు.

Show comments