NTV Telugu Site icon

Nandamuri Balakrishna: బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ కల్యాణ్‌కు నాకు మధ్య సారూప్యత ఉంది..!

Balakrishna

Balakrishna

Nandamuri Balakrishna: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఈ రోజు జరిగిన టీడీపీ – జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కు నాకు మధ్య సారూప్యత ఉందన్నారు.. నేను , పవన్ కల్యాణ్‌ ముక్కుసూటిగా మాట్లాడుతాం అన్నారు. ప్రజా ఉద్యమంలో పాల్గొనడానికి నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నాను అని తెలిపారు.. టీడీపీ-జనసేన కలయిక కొత్త శకానికి నాంది పలికుతుందన్న ఆయన.. రాష్ట్ర మొత్తం ఇన్ని సీట్లు అన్ని సీట్లు కాదు.. మొత్తంగా టీడీపీ , జనసేన గెలవాలని పిలుపునిచ్చారు..

Read Also: Taj Mahal: తాజ్ మహల్ వద్ద సీపీఆర్ చేసి తండ్రి ప్రాణాలు కాపాడుకున్న యువకుడు

ఇక, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు బాలకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అని మండిపడ్డారు.. రాష్ట్రంలో పరిపాలన మొత్తం నేరస్తులు, హంతకుల చేతిలో ఉందన్నారు. ప్రజాస్వామ్య సంరక్షణ అందరూ కలిసి పోరాటం చేయాలి.. పరిపాలన ఇష్టరాజ్యంగా సాగుతుంది.. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి పనులు చేయడం లేదు.. ఒక హిందూపురంలో తప్ప అని.. ప్రతిపక్షంలో ఉండే అభివృద్ధి పనులు చేస్తున్నాం అని వెల్లడించారు. ఒక సిమెంట్ రోడ్డు గానీ, ఒక గొయ్యికి తట్టెడు మట్టడు కానీ పోయలేదు, తట్టేడు మట్టికాని తీయలేదని విమర్శించారు. పరిపాలన చేతకాక మూడు రాజధానులు అంటూ కాలయాపన చేస్తున్నారు.. పెయిడ్ ఆర్టిస్టులతో పారిశ్రామిక సదస్సులు నిర్వహించారు. కానీ, రాష్ట్రానికి ఒక పరిశ్రమ రాలేదు అని ఆరోపించారు. ఆరోగ్య ఆస్పుత్రులకు బకాయి పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి.. డబ్బులు ఇచ్చి సలహాదారులను పెట్టుకున్నాడు అని విమర్శించారు.. గడపగడపలో పార్టీలకు అతీతకంగా ప్రజలు నిలదీస్తున్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.

Read Also: Gaza: టన్నెళ్లలో ఇజ్రాయెల్ సైనికుల తనిఖీలు.. గాజాలోని అల్ షిఫా ఆసుపత్రిలో భారీగా ఆయుధాలు..!

వైఎస్‌ జగన్‌ పాలనలో పది సంవత్సరాలు పాటు రాష్ట్రంలో పాలన వెనక్కి వెళ్లిపోయిందన్నారు బాలయ్య. రాష్ట్రానికి అప్పులు ఇచ్చే వాళ్ళు కరువయ్యారు.. 1000 కోట్ల అప్పు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. టీడీపీ – జనసేన కార్యకర్తలు కలవడం.. ఇలా సమావేశం నిర్వహించడం.. కలిసి ముందుకు నడవడం.. ఒక మంచి శుభ పరిణామం అన్నారు. జనం స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు అని తెలిపారు. సామాజిక సాధికార బస్సుయాత్రలో స్వతంత్ర సమరయోధులను అవమానిస్తున్నారు.. మన ఉనికికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు.. అరాచక ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయాలంటే ఓటు ఒక్కటే.. ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఉద్యమించాలని పిలుపునిచ్చారు బాలయ్య.