నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ 2’ ఆశించిన స్థాయి భారీ విజయం సాధించలేదనే ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బాలయ్య తదుపరి సినిమాలపై, అలాగే సరైన దర్శకుడి ఎంపికపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిల్స్ లో బాలయ్య ఈ సారి కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు అనే టాక్స్ బలంగా వినిపిస్తున్నాయి. కొరటాల శివ, బాలకృష్ణ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం టాక్ ఆఫ్ టౌన్ గా నిలుస్తుంది.
Also Read : TheRajasaab : రెబల్ సాబ్ రెడీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ఫిక్స్?
కొరటాల శివ ఇప్పటివరకు పెద్ద స్టార్లతో భారీ బడ్జెట్ సినిమాలు చేశారు. ‘మిర్చి’ నుండి ‘భరత్ అనే నేను’ వరకు నాలుగు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు కొరటాల. కానీ మెగాస్టార్ చిరు, చరణ్ కలయికలలో చేసిన ‘ఆచార్య’తో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా ఊహించిన దానికి మించి ప్లాప్ అయింది. లాంగ్ గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ తో ‘దేవర’సినిమా చేసి మరొక హిట్ అందుకున్నాడు కొరటాల. అయితే కొరటాల నెక్ట్స్ సినిమాగా ‘దేవర – 2’ స్టార్ట్కావాల్సి ఉంది, కానీ పదేపదే ఆలస్యం కావడంతో ఆ సినిమా ఆగిపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫలితంగా, కొరటాల శివ ఎలాంటి కొత్త ప్రాజెక్టులు లేకుండా ఏడాదికి పైగా ఖాళీగా ఉన్నారు. మరోవైపు టాప్ హీరోలందరూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోలతో సినిమా చేయాలని ప్లాన్ చేసిన కొరటాలకు చిరుతో సినిమా చేసే పరిస్థితి లేదు. దీంతో బాలకృష్ణతో అయితే బాగుంటుందని భావిస్తున్నారు. బాలకృష్ణ వరుసగా ఐదు ₹100 కోట్ల గ్రాసర్లను అందించారు, కానీ కుటుంబ ప్రేక్షకులు ఆయన సినిమాలకు పూర్తిగా కనెక్ట్ కాకపోవడంతో అవి ₹200–250 కోట్ల పెద్ద స్థాయికి చేరుకోలేకపోయాయి. మరోవైపు, కొరటాల మాస్ మరియు క్లాస్ ఆడియెన్స్ కు తగ్గట్టు సినిమాలు చేస్తాడు. అది బాలయ్యకు సెట్ అవుతాయి. ఈ కలయి బాలకృష్ణ మరియు కొరటాల శివకు మంచి అప్షన్ అనే చెప్పాలి.