Balakrishna: పారితోషికంలో నిర్మాతల కోసం.. బాలయ్య స్ట్రాంగ్ డిసిషన్
నందమూరి బాలకృష్ణ అంటే కేవలం సిల్వర్ స్క్రీన్ పై గర్జించే సింహం మాత్రమే కాదు, నిర్మాతల కష్టాలను అర్థం చేసుకునే గొప్ప మనసున్న వ్యక్తి అని మరోసారి నిరూపితమైంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోలు తమ రెమ్యునరేషన్లను కోట్లకు కోట్లు పెంచుకుంటూ పోతుంటే, బాలయ్య మాత్రం అందుకు భిన్నంగా తన పారితోషికాన్ని తగ్గించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘అఖండ-2’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టినప్పటికీ, భారీ బడ్జెట్ (రూ. 120-125 కోట్లు) కారణంగా నిర్మాతలు ఆశించిన స్థాయిలో లాభాలను అందుకోలేకపోయారు. ఈ విషయాన్ని గమనించిన బాలయ్య, తన తదుపరి చిత్రంపై ఆ భారం పడకూడదని నిర్ణయించుకున్నారు.
‘అఖండ-2’ కోసం రూ. 40 కోట్లు తీసుకున్న బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న #NBK111 చిత్రం కోసం కేవలం రూ. 30 కోట్లే తీసుకుంటున్నారట. ఒక్క సినిమాకే దాదాపు రూ. 10 కోట్ల పారితోషికాన్ని తగ్గించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిర్మాత శ్రేయస్సు కోరి ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై ఇండస్ట్రీలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు #JaiBalaiah అంటూ ట్రెండ్ చేస్తున్నారు. “మా బాలయ్య బంగారం.. నిర్మాతలను కాపాడే రియల్ హీరో” అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా రెమ్యునరేషన్ డిమాండ్ చేసే హీరోలు ఉన్న ఈ కాలంలో, బాలయ్య వ్యవహరించిన తీరు ఆదర్శప్రాయమని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Jowar Chilla Recipe: జొన్న పిండితో 10 నిమిషాల్లో కరకరలాడే హెల్దీ చిల్లా.. పిల్లలు, పెద్దలు ఎవరూ విడిచిపెట్టరు అంతే..!
- Kerala Story 2 OTT: ‘కేరళ స్టోరీ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్‌ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
తాజావార్తలు
-
Balakrishna: పారితోషికంలో నిర్మాతల కోసం.. బాలయ్య స్ట్రాంగ్ డిసిషన్
-
Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
-
Ashu Reddy: 9.5 కోట్ల చీటింగ్ కేసు.. మీడియా ముందుకు అషు రెడ్డి?
-
Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
-
Niharika Konidela: సుడిగాలి సుధీర్ హీరోగా 25 కోట్ల సినిమా…కానీ?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!