కూనో నేషనల్ పార్క్ లో ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఇటీవలే నమీబియా, ఆఫ్రికా20 నుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్ లోని షియోపూర్ జిల్లాలో గల నేషనల్ పార్క్ లో విడిచిపెట్టారు. అయితే అందులో ఇప్పటికే కొన్ని చీతాలు మరణించాయి. కాగా, తాజాగా వాటిలోని కొన్ని పోట్లాడుకున్నాయి.
Read Also: JioPhone 5G Smartphone: జియో నుంచి చౌకైన 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్, ధర వివరాలివే!
నమీబియా నుంచి తీసుకొచ్చిన గౌరవ్, శౌర్య, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన అగ్ని, వాయు చీతాలు తీవ్రంగా గొడవపడ్డాయి. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పార్క్ లోని ఫ్రీ రేంజ్ ఏరియాలో నాలుగు చీతాలు ఒకదానికి ఒకటి పరస్పరం తలపడినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. చీతాల మధ్య ఘర్షణను గమనించిన అధికారులు వాటిని చెదరగొట్టేందుకు పెద్ద ఎత్తున టపాసులు, సైరన్ లను మోగించారు.
Read Also: Chandrayaan 3: రాకెట్ అనుసంధానం పూర్తి.. చంద్రయాన్-3 ప్రయోగం ఎప్పుడంటే..?
అయితే ఈ గొడవలో ఒక చీతా తీవ్రంగా గాయపడినట్లు కూనో నేషనల్ పార్క్ అధికారులు తెలిపారు. గాయపడిన చీత అగ్నికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని, దాని ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. అయితే, చీతాల మధ్య ఇలాంటి గొడవలు సహజమే అని డివిజనల్ అటవీ అధికారి పీకే వర్మ పేర్కొన్నారు.
Read Also: Neetha Ambani: హ్యాండ్ బ్యాగ్ ఖరీదు రూ. 3.20 కోట్లు.. ఎవరిదో తెలుసా?
కాగా, దేశంలో అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా గదేడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు ఆఫ్రికాలోని నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కుకు తీసుకొచ్చారు. రెండో దశలో ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 12 చీతాలను పార్క్‌కు తరలించారు. అయితే ఆ 20 చీతాల్లో ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆరు చీతాలు చనిపోయాయి. మరణించిన వాటిలో మూడు కూనలు కూడా ఉన్నాయి.