Neetha Ambani: హ్యాండ్ బ్యాగ్ ఖరీదు రూ. 3.20 కోట్లు.. ఎవరిదో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neetha Ambani: సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలు ఏదీ చేసినా సంథింగ్ స్పెషల్‌గా చూస్తారు జనం. వారు వేసుకొనే చెప్పులు, బట్టలు, వాడే వాచీ, కళ్లద్దాల గురించి మాట్లాడుకుంటారు. ఇక వారు వాడే వాహనాలు కార్లు కావొచ్చు.. బైక్‌లు కావచ్చు.. ఇలా ఏదైనా సంధింగ్ స్పషల్‌గానే చెప్పుకుంటారు. అలాంటిదే ఆమె ఒక బడా వ్యాపారవేత్త కుటుంబం నుంచి వచ్చారు. ష్యాషనబుల్‌గా ఏది మార్కెట్‌లోకి వచ్చినా దానిని తప్పకుండా ఉపయోగిస్తారు. ఇపుడు ఆమె వాడే హ్యాండ్ బ్యాగ్‌తో వార్తల్లో నిలిచారు. ఎందుకంటే ఆమె వాడే హ్యాండ్ బ్యాగ్ విలువ ఎంతో తెలుసా? అక్షరాలా 3 కోట్ల 20 లక్షలు.. అదేంటీ హ్యాండ్ బ్యాగ్ అంతనా.. అన్ని కోట్లు పెట్టి హ్యాండ్ బ్యాగ్ కొని వాడుతున్నారా? అని ఆశ్యర్యపోతున్నారా? ఇది నిజం ఆమె వాడే హ్యాండ్ బ్యాగ్ ఖరీదు రూ. 3.20 కోట్లు. ఆమె ఎవరో కాదు.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి.. నీతా అంబానీ..
Read also: Thamanna – Vijay Varma : విజయ్ వర్మ తో తమన్నా.. ఆవుట్ సైడ్ కెమెస్ట్రీ సూపర్ గురూ.!
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
నీతా అంబానీ నిజంగా ఒక స్టైలిష్ ఐకాన్‌గా ఉంటారు. ఆమె తన ఫ్యాషన్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. తను వాడే దుస్తులైనా, పాదరక్షలైనా, బ్యాగ్‌లైనా నీతా అంబానీ స్టైల్ స్టేటస్‌గా నిలుస్తుంటాయి. తాజాగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో, నీతా అంబానీ అందరి దృష్టిని ఆకర్షించారు. కల్చరల్ సెంటర్‌లో మూడవ రోజు నీతా కాఫీ టేబుల్ పుస్తకాన్ని ప్రారంభించారు. అక్కడ తను చాలా మందిని ఆకర్షించింది. నీతా అంబానీ ఈ సారి ఓపెన్ హెయిర్, మినిమల్ మేకప్‌తో కనిపించించారు. ఈసారి నీతా అంబానీ తన వెంట తెచ్చిన అత్యంత ఖరీదైన బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
Read also: Assam Floods: అస్సాంలో కొనసాగుతున్న వరద పరిస్థితి.. ఒక్క జిల్లాలోనే 67వేల మంది!
నీతా అంబానీ ఫౌబర్గ్ బిర్కిన్ 20 వైట్ మ్యాట్ ఎలిగేటర్ హ్యాండ్‌బ్యాగ్ వెంట తెచ్చుకున్నారు. ఈ బ్యాగ్ రూపకల్పన చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. దీని ప్రత్యేక నాణ్యత కారణంగా బ్యాగ్ చాలా ప్రజాదరణ పొందింది. ఈ బ్యాగ్ ఖరీదు 4,00,000 అమెరికన్ డాలర్లు.. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 3.2 కోట్లు అన్నమాట. హెర్మెస్ బిర్కిన్ బ్యాగ్‌లు కొనడం చాలా కష్టం. దీనికి కారణం అధిక ధర మాత్రమే కాదు. ఈ బ్రాండ్ చాలా సెలెక్టివ్ బ్యాగ్‌లను డిజైన్ చేస్తుంది. అలాగే వాటిని విక్రయించడంలో మరింత సెలెక్టివ్‌గా ఉంటారు. ఈ బ్యాగ్‌లలో ఒకటి తయారు చేయడానికి నెలలు, సంవత్సరాలు కూడా వేచి ఉండాలి. అంతటి విలువైన ఈ బ్యాగ్ నీతా అంబానీ తన వెంట తెచ్చుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నీతా అంబానీ తన లైఫ్ స్టైల్ కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడరు. ముఖ్యంగా ఆమె చీరల విషయంలోనూ అలాగే ఫ్యాషన్ విషయంలోనూ చాలా సెలెక్టివ్ గా ఉంటారు. అందుకే తరచూ ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ ఉంటారు. ఇటీవల వైట్ హౌస్ లో నిర్వహించిన విందు కార్యక్రమంలో ఆమె ధరించిన తెల్ల చీర కూడా ఒక సెన్సేషన్ అయిందంటే ఆశ్చర్యం కాదేమో. ఎందుకంటే ఈ చీరలు తయారు చేయడానికి దాదాపు ఒక సంవత్సరం సమయం పట్టిందని డిజైనర్లు చెబుతున్నారు.
తాజావార్తలు
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
-
Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
-
Off The Record : ఎన్నికల కోసం బీఆర్ఎస్ EXTRA కేర్ తీసుకుంటుందా?
-
ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!