NTV Telugu Site icon

Kiran Kumar Reddy: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. రాష్ట్ర విభజన తర్వాత ఆయన తొలి ప్రసంగం

Kiran Kumar Reddy

Kiran Kumar Reddy

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన త్వరత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో మెదటసారి బహిరంగ సభలో మాట్లాడారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత నిర్వహించిన సభలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. అయితే, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈయన వ్యాఖ్యనించారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని తెలిపారు. అందుకు జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలోని దుబ్బాక, హుజూరాబాద్ ల్లో బీజేపీ గెలిచింది ఇందుకు ఉదాహరణ అని చెప్పారు.

Read Also: Locket Chatterjee: పశ్చిమ బెంగాల్‌లోనూ మణిపూర్‌ తరహా ఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న బీజేపీ ఎంపీ

ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. తమకు కుటుంబ పాలన వద్దని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ని గద్దె దింపి బీజేపీ అధికారంలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావటానికి తాను కూడా కృషి చేస్తానని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Read Also: Rajamouli: కల్కి ఫస్ట్ గ్లింప్స్.. ఆ ఒక్కటి మిస్ అయ్యింది

కారు తాళాలు మనం తీసుకోవాలి అని బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కారు స్టీరింగ్ తమ దగ్గర ఉందని పతంగి పార్టీ వాళ్ళు అంటుంటారు.. తాళాలు తీసుకుంటే కారు ముందుకు వెళ్ళదు అంటూ ఆయన కామెంట్స్ చేశారు. బండి సంజయ్ బీజేపీ పార్టీలో జోష్ తెచ్చారు.. కిషన్ రెడ్డి పార్టీనీ అధికారంలోకి తెచ్చే సత్తా ఉంది అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 2004లో సైకిల్ వెనకాల బీజేపీ కిషన్ రెడ్డి ఉన్నారని నేనే విమర్శించాను.. ఇప్పుడు నేనే బీజేపీలో రావాల్సి వచ్చింది.. బీజేపీకి ఎన్నికకు ఎన్నికకు ఓట్లు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు అంటూ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.