Tragedy: నల్గొండలో దారుణం.. ఒకే ఇంట్లో కుళ్ళిన స్థితిలో నాలుగు మృతదేహాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపిన ఘోర విషాదం చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని సాగర్ రోడ్డులో గల తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఒక ఇంట్లో నాలుగు మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
తెలంగాణ కాలనీలోని సదరు నివాసం నుండి గత కొంతసమయంగా తీవ్రమైన దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి పరిశీలించారు. అక్కడ నాలుగు మృతదేహాలు పూర్తిగా కుళ్ళిన స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహాలు దాదాపు నాలుగు రోజుల క్రితమే కుళ్ళిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో లభించిన క్లూస్, ఇతర సాక్ష్యాధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
హత్యా? ఆత్మహత్యా?..
ఒకే ఇంట్లో నలుగురు అనుమానాస్పదంగా మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ అదే కుటుంబానికి చెందిన మరొక వ్యక్తి కనిపించడం లేదు. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణానికి గల అసలు కారణాలు తెలుస్తాయని, కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నామని నల్లగొండ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!