Nagababu: అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం అయ్యింది.. ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతం జరగబోతోంది.. అద్భుతం జరిగేటప్పుడు అందరూ సహకరించాలి.. పవన్ కల్యాణ్ కోసం నేను ఏమి చేయడానికి అయినా రెడీ అని ప్రకటించారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ జనసేన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర జాతికి ప్రమాదకరం అన్నారు. కరోనా వైరస్ తరువాత ప్రమాదకర వైరస్ వైసీపీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వైరస్ కు జనసేన, టీడీపీయే అసలైన మందుగా అభివర్ణించారు.
Read Also: Komatireddy Venkat Reddy : చెరువుగట్టు బ్రహ్మోత్సవాల నిర్వాహణపై మంత్రి కోమటిరెడ్డి రివ్యూ
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు తప్ప.. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి లేదని దుయ్యబట్టారు నాగబాబు.. భూ కబ్జాల కోసం రాజధాని అన్నారా..!? అని ప్రశ్నించారు. యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అద్భుతం జరిగేటప్పుడు అందరూ సహకరించాలి. పవన్ కోసం నేను ఏమి చేయడానికి అయినా రెడీ అని వెల్లడించారు. పవన్ కల్యాణ్ కు ఓటు వేసే ముందు మమ్మల్ని చూసి కాకుండా.. భావితరాల భవిష్యత్ ను, మీ బిడ్డలను చూసి ఓటేయ్యండి అని పిలుపునిచ్చారు. అధికార, అహంకారంతో ఉన్న వైసీపీని గద్దె దించాల్సిందే అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్‌నే అక్కడ ప్రజలు ఓడించారు.. అలాంటిది ఎటువంటి అభివృద్ధి చేయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా? అని ప్రశ్నించారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు.
