Site icon NTV Telugu

Naga Vamsi: మీనాక్షి నా బుర్ర తినేసేది.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు

Meenakshi Chaudhary

Meenakshi Chaudhary

Naga Vamsi: సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తూ సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న ‘అనగనగా ఒక రాజు’లో నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ప్రేక్షకుల సంపూర్ణ మద్దతుతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తున్న నేపథ్యంలో.. తాజాగా చిత్ర బృందం థాంక్యూ మీట్ ని నిర్వహించి, ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపింది. ఈ క్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది. 2020లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత ఆ స్థాయి తృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది. ఈ సంక్రాంతికి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఈ సినిమా విషయంలో మీడియా నుంచి వచ్చిన అపారమైన మద్దతుకు ధన్యవాదాలు.

READ ALSO: Grok : మస్క్‌కు గ్రోక్ గోస.. కోర్టుకెక్కిన సెలబ్రిటీ

ఎందరో సినీ నిర్మాతలు కూడా ఈ సినిమా ఆడాలని కోరుకున్నారు. అందరి ఆశీస్సులతోనే ఈ స్థాయి విజయం లభించింది. అలాగే, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతగానో మద్దతు తెలుపుతున్నారు. ఆ అభిమానులంతా సంతోషపడే భారీ ప్రకటన త్వరలోనే రాబోతుంది. ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు విడుదలైనప్పటికీ.. మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ తగినన్ని థియేటర్లను మాకు కేటాయించి ఎంతో అండగా నిలిచారు. అందుకే రెండు రోజుల్లోనే రూ.41 కోట్ల గ్రాస్ రాబట్టగలిగింది ఈ చిత్రం. నన్ను, నవీన్ ని నమ్మి మా కోసం థియేటర్లు ఉంచిన డిస్ట్రిబ్యూటర్లకు కృతఙ్ఞతలు. సంక్రాంతి సమయంలో సినిమా విడుదల చేసి హిట్ కొట్టడం నాకు ప్రత్యేకమైనది. ఈ ప్రత్యేకమైన విజయంలో భాగమై, తన పూర్తి మద్దతు ఇచ్చిన నవీన్ కి ధన్యవాదాలు. ఏడాది పాటు వేరే సినిమాలు ఒప్పుకోకుండా.. మా సినిమాకు పూర్తి సమయం కేటాయించిన మీనాక్షి చౌదరికి కృతఙ్ఞతలు. అయితే ఆమెను అలా వేరే సినిమాలు ఒప్పుకోకుండా ఉండమన్నందుకు నా బుర్ర తినేసేది అని ఆయన అన్నారు.

READ ALSO: Peddi: ‘పెద్ది’ ఓటీటీ డీల్ క్లోజ్.. కళ్లు చెదిరే ధరకు డిజిటల్ రైట్స్!

Exit mobile version