Lucky Bhaskar : పేరుకు మలయాళ హీరో అయినా వివిధ భాషలలో సినిమాలు చేస్తూ, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. గతంలో సీతారామంతో ఎంట్రీ ఇచ్చిన ఆయన తాజాగా తెలుగులో “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది.
Read Also:Nani – Srikanth odela : పూజా కార్యక్రమాలతో నాని-ఓదెల రెండో ప్రాజెక్ట్ షురూ
తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించి చిత్ర విశేషాలను పంచుకున్నారు. దుల్కర్ సల్మాన్‌కు ఉన్న ఫాలోయింగ్ కారణంగా ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో పాన్-ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు. అన్ని ప్రధాన మార్కెట్లలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ విడుదల విషయానికి వస్తే, అది మిగతా భాషల్లో విడుదల చేసే సమయంలో కాకుండా, కొద్దిగా ఆలస్యంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నిర్మాత ఎస్ నాగ వంశీ మాట్లాడుతూ, “తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అక్టోబర్ 31న చిత్రాన్ని రిలీజ్ చేస్తామని, కానీ హిందీ వెర్షన్ నవంబర్ మొదటి వారంలో రిలీజ్ అవుతుందని” వెల్లడించారు.
Read Also:Utsavam: ప్రైమ్ వీడియోలో ఆకట్టుకుంటున్న ఉత్సవం
బాలీవుడ్ లో నవంబర్ 1న విడుదలవుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సింగం అగేన్’ సినిమా విడుదల అవుతుంది. “సింగం అగేన్” వంటి పెద్ద చిత్రంతో ఒకే రోజు విడుదలైతే “లక్కీ భాస్కర్” హిందీ వెర్షన్‌కి తగిన స్థాయి థియేటర్లు దొరకే ఛాన్స్ ఉండకపోవచ్చు. కాబట్టి హిందీ మార్కెట్ లో మరింత స్పేస్ దొరికేలా, నవంబర్ మొదటి వారంలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు. అంతేకాకుండా ఇప్పటి నుంచి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 21న ట్రైలర్ విడుదల చేసి అక్టోబర్ 26 లేదా 27 తేదీల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.