నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. అక్టోబర్ 29న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. ఈ మూవీకి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ప్రేమ, కుటుంబం, అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. జనవరి 7 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 వెల్లడించింది.
Read Also: 2021 టాలీవుడ్ హిట్స్ – ఫట్స్
ఈ మూవీలో ఆకాష్ పాత్రలో నాగశౌర్య, భూమి పాత్రలో రీతూవర్మ కనిపిస్తారు. సీనియర్ నటి నదియా హీరోయిన్‌కు తల్లిగా నటించింది. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చగా వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. దర్శకురాలు లక్ష్మీసౌజన్య తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించారు.
