Site icon NTV Telugu

Wedding Card : ‘చైతు -శోభితా’ వెడ్డింగ్ డేట్ పై క్లారిటీ

New Project (8)

New Project (8)

Wedding Card : హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుక కూడా జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతుండగా.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఈవెంట్‌పై క్లారిటీ వచ్చింది. డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి జరగనుందని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు, ఇది అధికారికంగా ధృవీకరించబడింది. అతిథులకు పంపిన గిఫ్ట్ హ్యాంపర్‌ల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read Also:Mallikarjun Kharge : మణిపూర్‌లో డబుల్ ఇంజన్ సర్కార్‌ ఏం చేస్తోంది?.. మోడీపై ఖర్గే ఫైర్

సినీ నటుడు నాగ చైతన్య, శోభిత వివాహం క్యాన్సిల్ అయిందని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వీరి పెళ్లి క్యాన్సిల్‌పై అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తమ పెళ్లిపై ఇలాంటి వార్తలపై స్పందించకపోతే పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నాగ చైతన్య, శోభిత పెళ్లి క్యాన్సిల్ అయిందన్న వార్తలపై శోభిత నాగ చైతన్య స్పందించారు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి కార్డుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయగా, ఈ ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. అందరూ ఊహించినట్లుగానే డిసెంబర్ 4న నాగ చైతన్య శోభిత వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లి రాజస్థాన్‌లో కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వెడ్డింగ్ కార్డ్‌లో కూడా పెళ్లి వేదికను వెల్లడించలేదు.

Read Also:Lipstick: లిప్‌స్టిక్‌ రాస్తున్నారా? ఈ విషయం తెలిస్తే అస్సలు టచ్‌ చేయరు..

Exit mobile version