Site icon NTV Telugu

Naga Chaitanya: నాగ చైతన్య లైఫ్‌లో మిస్ అయిన అమ్మాయి ఎవరో తెలుసా?

Naga Chaitanya

Naga Chaitanya

Naga Chaitanya: వెండి తెరకు అక్కినేని నాగార్జున కొడుకుగా పరిచయం అయిన అక్కినేని నటవారసుడు నాగ చైతన్య. ఆయన ఒక్కో సినిమా చేసుకుంటూ టాలీవుడ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా ఆసక్తికరమైన స్టోరీని ఒకటి చెప్పారు. ఒక అమ్మాయి కారణంగా విడిపోయిన స్నేహితులు ఉంటారని, కానీ తన లైఫ్‌లో మాత్రం ఒక అమ్మాయి కారణంగా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారని చెప్పారు.

READ ALSO: Bengaluru: ఒక్కగానొక్క బిడ్డ మృతి.. అంబులెన్స్, ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం ఎక్కడ చూసిన లంచాలే..! చివరికీ..

చైతు ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన స్కూల్‌ లైఫ్‌లో ఒక అమ్మాయి అంటే ఇష్టం ఉండేదని చెప్పారు. ఆ అమ్మాయినే మరో ఇద్దరు కూడా ప్రేమించారని అన్నారు. వాళ్లిద్దరి పేర్లు కృష్ణ, గుహ అని చెప్పారు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఆ ఇద్దరు కూడా తర్వాత తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారని నాగ చైతన్య పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కావడానికి కారణం ఆ అమ్మాయని అన్నారు. మేము ముగ్గురం కూడా ఆ అమ్మాయికి తమ ప్రేమ విషయాన్ని చెప్పినట్లు తెలిపారు. కానీ ఆ అమ్మాయి ఒక్కొక్కరిని రిజెక్ట్ చేసిందని వెల్లడించారు. ఆ సమయంలో ముగ్గురం ఒకరినొకరం ఓదార్చుకున్నామని అన్నారు. అలా వాళ్లిద్దరూ తన లైఫ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారినట్లు చెప్పారు. ఒకరకంగా చెప్పాలంటే ఆ అమ్మాయే తనకు వాళ్లిదరిని బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఇచ్చిందన్నారు. తన లైఫ్‌లో ఆ అమ్మాయి మిస్ అయిన కూడా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ దొరికారని చెప్పారు. చైతు కెరీర్ విషయానికి వస్తే ఆయన తండేల్ సినిమాతో సక్సెస్ కొట్టారు. ప్రస్తుతం ఆయన పలు సినిమాలను పట్టాలెక్కించారు.

READ ALSO: IED Attack Pakistan: పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బాంబు దాడి.. కెప్టెన్ సహా ఆరుగురు మృతి

Exit mobile version