గుంటూరులో నేడు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు. గుంటూరు ఛానల్ పొడిగింపు పనులకు నిధులు మంజూరు చేయాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహసిస్తున్న 11వ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొని రైతులకు మద్దతు పలికారు. ఆయనతో పాటు జనసేన నాయకులు మనోహర్, తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. నల్లమడ రైతులకు జనసేన పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. నీళ్ళ కోసం రైతులు పోరాటానికి దిగాల్సి రావడం ప్రభుత్వానికి సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య లు చేసుకున్నారని ఆయన విమర్శించారు.
Also Read : Maharastra : అనర్హత పిటిషన్‌పై సమాధానం ఇవ్వండి.. 54 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసు
128 ఎకరాలు భూసేకరణ కోసం మూడువందల కోట్లు కేటాయించ లేని ప్రభుత్వం ఇది అని ఆయన మండిపడ్డారు. గుంటురు ఛానల్ ను పర్చూరు వరకు పోడిగిస్తే యాభైవేల ఎకరాలకు నీరు అందించే పరిస్థితి ఉంటుందని ఆయన వెల్లడించారు. పులిచింతల గేటు విరిగి రెండు సంవత్సరాలు అయినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో గేటు పెట్టలేక పోయారని, ఈ ప్రభుత్వానికి స్పందించే గుణం లేదన్నారు మనోహర్. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని, ఓట్ల కోసం చేసే రాజకీయాలను ప్రజలు వ్యతిరేకించాలని ఆయన తెలిపారు. జనసేన అధికారంలోకి వస్తే నల్లమడ రైతుల కష్టాలు తీరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read : Kishan Reddy: ప్రధాని కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారు?.. బీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి ఫైర్..