NTV Telugu Site icon

Nadendla Manohar: ముందస్తు కోసమే కోనసీమ కుట్ర

మంగళగిరిలో జరుగుతున్న జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికల తేవాలనే ఉద్దేశ్యంతోనే కోనసీమలో కుట్ర పన్నారన్నారు నాదెండ్ల.వచ్చే నెలలో పులివెందులలో పవన్‌ పర్యటన వుంటుందన్నారు.

ప్రభుత్వమే కోనసీమలో కులాల చిచ్చు పెట్టింది.కోనసీమ ఘటనపై ఇప్పటి వరకు సీఎం జగన్‌ స్పందించ లేదు.కోనసీమలో శాంతి నెలకొనాలనే అప్పీల్‌ కూడా చేయలేదు.ముందస్తు ఎన్నికలు తేలవాలనే వ్యూహంలో భాగంగానే కోనసీమ కుట్ర.కోనసీమలో అలజడి సృష్టించారు.ఇంటర్నెట్‌ కట్‌ చేశారు.. వర్క్‌ ఫ్రం హోం చేసుకోలేని పరిస్థితి.కోనసీమలో శాంతి నెలకొనాలని అందరికంటే ముందుగా స్పందించింది పవన్‌ కళ్యాణే.

జనసేన కార్యకర్తలే కోనసీమ గొడవకు కారణమంటూ ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తోంది.తప్పు చేసిన వారిని శిక్షించండి.. తప్పు చేయని వారిని అరెస్టులు చేస్తే సహించం.కోనసీమ ఘటనలో తప్పుడు కేసుల నుంచి బయపడేసేందుకు జనసేన లీగల్‌ టీం ఏర్పాటు చేశాం.మంత్రి పినిపె విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ ఇళ్లపై దాడి జరగడం బాధాకరం.జనసేన బలంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో పార్టీని బలహీన పర్చేందుకే కోనసీమ ఘటనలో జనసేనకు పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు.

జనసేన కార్యకర్తలపై బనాయిస్తున్న కేసుల విషయాన్ని వివరించేందుకు డీజీపీ వివరిస్తామంటే అప్పాయింట్మెంట్‌ కూడా ఇవ్వడం లేదు.వచ్చే నెలలో కడప జిల్లాలో కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా పవన్‌ పర్యటించనున్నారు.జగన్‌ సీఎం అయ్యాక కడప జిల్లాలో 132 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.132 మంది కౌలు రైతుల్లో 13 మంది పులివెందుల నుంచే ఉన్నారు.కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా పులివెందులలోనే పవన్‌ సభ.

తల్లికి అన్నం పెట్టని వాడు.. పిన్నమ్మకు గాజులు చేయిస్తానన్నడటా అంటూ వైఎస్‌ పదే పదే చెబుతుంటారు.సొంత జిల్లాలో.. సొంత నియోజకవర్గంలో రైతులు చనిపోతున్న పట్టించుకోని సీఎం జగన్‌.. రాష్ట్రానికి ఏదో మేలు చేస్తానంటే నమ్మగలమా..?ఆత్మహత్య చేసుకున్న ఒక్కో కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించాం.ఇప్పటి వరకు 132 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేన ఆర్థిక సాయం అందించింది. త్వరలోనే ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాల్లో పవన్‌ పర్యటిస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Atchannaidu : బొత్సకు వైన్ షాపుల సంఖ్య తప్ప పాఠశాలల సంఖ్య తెలుసా

Show comments