NTV Telugu Site icon

Nadendla Manohar: జనసైనికులపై దాడులతో పాటు కేసులా?

Nadendla Manohar

Nadendla Manohar

ఏపీలో వైసీపీ పాలనపై మండిపడుతోంది జనసేన. జనసేన, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ జన సైనికులపై దాడులు చేయడంతోపాటు కేసులు పెడతారా? అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆకుమర్రు, బేవరపేటల్లో ప్రజల తరఫున మాట్లాడిన జనసేన నేతలపై వైసీపీ దౌర్జన్యం చేసింది. వైసీపీ నేతల రాక్షస పాలనకు అంతు లేకుండా పోతోంది. పెడన నియోజక వర్గం ఆకుమర్రు, చీపురుపల్లి నియోజకవర్గం బెవరపేట గ్రామాల్లో జన సైనికులపై వైసీపీ దుండగులు జరిపిన దాడిలో ఆకుమర్రులో ముగ్గురు, బెవరపేటలో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు.

Read Also: MP Sanjay Raut : మరో 15రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుంది .. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

రెండుచోట్లా దాడులకు కారణం ప్రజల తరఫున వైసీపీ అక్రమాలను జన సైనికులు ప్రశ్నించడమే కారణం అన్నారు నాదెండ్ల మనోహర్. రెండు చోట్లా దాడి చేసిన వారే పోలీస్ కేసులు పెట్టడం, అది కూడా సానుభూతి కోసం మహిళలతో కేసు పెట్టించడం వైసీపీ వికృత చేష్టలకు పరాకాష్ట.ఆకుమర్రు చెరువు పూడిక తీతలో అక్రమాలు జరుగుతున్నాయని జనసేన నేతలు ఫోటోలు తీస్తుండగా స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు జన సైనికులను నిర్బంధించారు.తీవ్రంగా హింసించి చివరికి వారిని పోలీసులకు అప్పగించి తమపై దాడి చేయడానికి వచ్చారని ఎదురు కేసు పెట్టారు.స్టిక్కర్లు అతికించవద్దు అంటే దాడులా?జగనన్న స్టిక్కర్లను తమ ఇళ్లకు అంటించవద్దని వారం కిందట బెవరపేటలో దాడులు చేశారు. ఈ దాడులు ఆపాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

Read Also: Artisans Strike: సమస్యలు పరిష్కరించాలని 25 నుంచి ఆర్టిజన్ల సమ్మె!