నభా నటేష్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నన్ను దోచుకుందువటే చిత్రంతో నభా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అనంతరం రవిబాబు తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం అదుగో లో నటించింది. తన మూడో చిత్రం ఇస్మార్ట్ శంకర్ లో రెండో హీరోయిన్ గా చేసింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని పాత్రలో అదరగొట్టింది.. రామ్ ఎనర్జీ కి ఈ భామ పెర్ఫార్మన్స్ తోడైయి సినిమా సూపర్ హిట్ అయింది.. కానీ ఆ తరువాత ఈ భామ నటించిన సినిమాలు అంతగా వర్క్ ఔట్ కాకపోవడంతో ఈ భామకు ఆఫర్స్ తగ్గాయి.. ఈ భామ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అవుతుంది. దర్శకులెవరూ ఆమెను అంతగా పట్టించుకోవడం లేదు.వరుస పరాజయాలు నభా నటేష్ కెరీర్ దెబ్బతీశాయి.
2021లో విడుదలైన మ్యాస్ట్రో చిత్రం తర్వాత ఆమె మరో చిత్రానికి సైన్ చేయలేదు. అయితే ఆఫర్స్ రాక కాదు, ప్రమాదం వలన విశ్రాంతి తీసుకున్నానని నభా నటేష్ చెబుతున్నారు. ఓ ప్రమాదంలో నభా ఎడమ భుజం ఫ్రాక్చర్ అయ్యింది.దానికి పలు సర్జరీలు కూడా జరిగాయి. . కోలుకునే సమయంలో మానసికంగా శారీరకంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నట్లు ఆ మధ్య నభా వెల్లడించారు.నభా సినీ కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా మాత్రమే సూపర్ హిట్ మూవీగా నిలిచింది.. 2019లో విడుదలైన ఈ చిత్రం రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. ప్రస్తుతం టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. టాలీవుడ్ లో హిట్ లేకపోతే ఆఫర్స్ రాబట్టుకోవడం కష్టమే..దీనితో నభా ఆఫర్స్ అందుకోవడానికి సోషల్ మీడియాను నమ్ముకుంది. నిత్యం తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఎంతో ఆకట్టుకుంటుంది. తాజాగా రెట్రో లుక్ లో దర్శనమిచ్చింది.. రెట్రో లుక్ లో నభా అదరగొడుతుంది.. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి