Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anakapalli Death Mystery: అనకాపల్లి జిల్లాలో ఓ యువకుడి మృతి కేసు సంచలనంగా మారింది. ఎంతో ఆరోగ్యంగా ఉండి.. ఆకస్మికంగా అనారోగ్యానికి గురై మరణించిన తన కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన తల్లి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడంతో, మూడు నెలల తర్వాత సమాధి నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే, అనకాపల్లి జిల్లా దిబ్బపాలెం సెజ్ కాలనీకి చెందిన షేక్ ఖాన్ (30) అనే యువకుడు చికెన్ దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అతను ఆకస్మికంగా అనారోగ్యానికి గురై మృతి చెందాడు. షేక్ ఖాన్ గుండెపోటుతో మరణించినట్లు అతని భార్య కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని దిబ్బపాలెం సెజ్ కాలనీలో ఖననం చేశారు.
అయితే కుమారుడి మృతిని జీర్ణించుకోలేకపోయిన తల్లి సైదుబేబీకి ఈ ఘటనపై అనుమానాలు కలిగాయి. తన కుమారుడి మరణం వెనుక ఏదో జరిగి ఉండొచ్చని భావించిన ఆమె ఈ నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమారుడి మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు వెలికితీయాలని కోరారు. తల్లి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభించారు. ఖననం చేసిన షేక్ ఖాన్ మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్య నిపుణుల సమక్షంలో మృతదేహం నుంచి అవసరమైన నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.
Also Read
- Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్‌గా న్యాయవాది హత్య స్కెచ్.!
- TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
- Hyderabad: న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య వెనుక మిస్టరీ ఇంతుందా?
- Husband Murder: ఖతర్నాక్ వైఫ్.. భర్తపై 3 కోట్ల బీమా చేసి కన్నింగ్ స్కెచ్.. చివరికిలా!
మృతదేహం నుంచి సేకరించిన నమూనాల నివేదికలు వచ్చిన తర్వాత మరణానికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లో పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మూడు నెలల తర్వాత సమాధి నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తల్లి చేసిన ఫిర్యాదుతో కొత్త మలుపు తిరిగిన ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారనుంది.
తాజావార్తలు
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
-
Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
-
Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
-
Kavya Maran: “ఓడినా తల ఎత్తుకుని వెళ్తాన్నాం”.. SRH టీమ్‌లో ధైర్యం నింపిన కావ్యా మారన్.. వైరల్ వీడియో
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..