Site icon NTV Telugu

Vasantha Venkata Krishna Prasad: మైలవరం జిలేబీ దేవినేని.. చేసేవన్నీ జిలేబీ పనులే..!

Vasantha Venkata Krishna Pr

Vasantha Venkata Krishna Pr

Vasantha Venkata Krishna Prasad: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై సెటైర్లు పేల్చారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీమంత్రి దేవినేని ఉమపై విమర్శలు గుప్పించారు.. మైలవరం జిలేబీ దేవినేని ఉమ, ఇతను చేసేవన్నీ జిలేబీ పనులేనంటూ ఎద్దేవా చేశారు.. జీవన్మృతుడు దేవినేని ఉమ అంటూ మండిపడ్డ ఆయన.. గతంలో నేను ప్రతిపక్షంలో ఉండగా ఎన్ని కక్ష్యసాధింపు చర్యలు చేశావో ఆత్మ పరిశీలన చేసుకోవాలని అని హితవుపలికారు. గతంలో మా నాయకులపై రౌడీ షీట్లు తెరిపించిన చరిత్ర దేవినేని ఉమదని ఫైర్‌ అయ్యారు..

Read Also: Chelluboina venugopal Krishna: మహానాడులో జగన్‌పై ధన్యవాద తీర్మానం చేయాలి.. ఎందుకంటే..?

అయితే, నాకు మాత్రం ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, తర్వాత అభివృద్ధి, ప్రజా సంక్షేమమే నా లక్ష్యం అని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. దేవినేని ఉమ అధికారంలో ఉన్నంత కాలం మైలవరం నియోజకవర్గంలో కనీసం తాగునీటి సమస్యను తీర్చలేకపోయాడని ఆరోపించారు.. మా హయాంలో జల జీవన్ మిషన్ తో ఇంటింటికి నీటి కుళాయిని ఇస్తున్నామని వెల్లడించారు. మైలవరంలో పదేళ్లు శాసనసభ్యునిగా ఉండి పట్టాలు ఇవ్వడం చేతగాని దద్దమ్మ దేవినేని ఉమ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, మైలవరం అయ్యప్ప నగర్ పేరు మార్చాలని ఆలోచన వచ్చినా.. చెప్పు తెగుద్ది దేవినేని ఉమ అంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్.

Exit mobile version