IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి సౌతాఫ్రికా స్టార్ బౌలర్ డేయిల్ స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 42 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటూ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడని పేర్కొన్నారు. ఇక, వింటేజ్ ధోనిని గుర్తుచేస్తూ ఐపీఎల్-2024లోనూ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడుతున్నాడు.. నిజానికి ఎంఎస్ ధోనిని చూసేందుకే చాలా మంది స్టేడియాలకు వెళ్తున్నారు.. ధోని బ్యాటింగ్‌కు వస్తున్నాడంటే టీవీలకు అతుక్కుపోయేవాళ్లు కోట్ల మంది ఉన్నారు.. అందులో నేనూ కూడా ఒకడినే అని డేయిల్ స్టెయిన్ చెప్పారు.
Read Also: Bode Prasad: కూటమి విజయం కోసం ప్రజలు సంకల్పించారు..! ఇదే స్ఫూర్తి కొనసాగాలి
ఐపీఎల్‌తో ఇక్కడ మాత్రమే కాదు.. సౌతాఫ్రికాలో నాలాంటి ఎంతో మందికి ఎనలేని సంతోషాన్ని ఇస్తున్నాడు అని డేయిల్ స్టెయిన్ పేర్కొన్నారు. నిజంగా చెప్పాలంటే నేను ఎక్కువగా టీవీ చూడను.. ఐపీఎల్ సమయంలో మాత్రం సీటుకు అతుక్కుపోతానన్నారు. కానీ నా గర్ల్‌ఫ్రెండ్ టీవీ పగిలిపోతుందని అంటుంది.. ఎందుకంటూ ఎప్పుడూ అది.. ఐపీఎల్‌కు స్టక్ అయిపోయి ఉంటుంది లెండి అని అతడు చెప్పుకొచ్చాడు. నేను ఎంఎస్ ధోని షాట్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను.. ఓ అభిమానిగా ఆ కోణంలోనే ధోని ఆటను ఎంజాయ్ చేస్తున్నా.. అతడు కొట్టే ప్రతీ షాట్‌ను ఆస్వాదిస్తాను.. నిజం చెప్తున్నా తన ఇన్నింగ్స్ చూసినప్పుడల్లా నాకు ఎంతో ఆనందం వేస్తుందని స్టెయిన్ తెలిపారు. అయితే, ధోనిని మిడిలార్డర్‌లో బ్యాటింగ్ కు తీసుకు వస్తే ఇంకా బాగుంటుంది కదాని డేయిల్ స్టెయిన్ కోరారు.
Read Also: Viral video: పంతులమ్మా.. స్కూల్‌లో ఇవేం పనులు.. పాఠాలు చెప్పకుండా ఏం చేసిందంటే..!
ఇక, ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతుంది.. స్టెయిన్ వ్యాఖ్యలకు ఫిదా అవుతున్న మహేంద్ర సింగ్ ధోని అభిమానులు.. మా మనసులోని మాట నువ్వు చెప్పావు అని కామెంట్స్ చేస్తున్నారు. తలా ఫినిషర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో వస్తే మరిన్ని మెరుపులు చూడొచ్చని పేర్కొంటున్నారు. అయితే, అదే సమయంలో ధోని మోకాలి నొప్పిని గుర్తు చేసుకంటూ.. తలా అలా క్రీజులోకి వచ్చి ఒక్క షాట్ ఆడినా సంతోషమేనంటున్నారు. సీఎస్‌కే ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
#Dhoni can reach anything and everything. 🔥💪
pic.twitter.com/bAaxqdezgb— Satan (@Scentofawoman10) March 31, 2024