Bode Prasad: కూటమి విజయం కోసం ప్రజలు సంకల్పించారు.. ఎన్నికల వరకు ఇదే స్ఫూర్తి కొనసాగాలన్నారు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ.. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో.. 2024 సాధారణ ఎన్నికలలో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బోడె ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, కొనకళ్ల నారాయణ, వంగవీటి రాధా, ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఒక వ్యక్తి నేను బటన్ నొక్కాను.. నొక్కాను అంటున్నారు.. ప్రజలు కూడా కుటమి గెలుపు కోసం బటన్ నొక్కలని అంటున్నారు.. కానీ, కూటమి విజయం కోసం ప్రజలు సంకల్పించారని తెలిపారు. ఈ ప్రాంతానికి బోడే ప్రసాద్ చాలా సేవలు చేశారు.. పెనమలూరు ప్రజలు బోడే ప్రసాద్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు వంగవీటి రాధాకృష్ణ.
Read Also: Zero Polling: ఆ ఆరు జిల్లాలో జీరో పోలింగ్..
ఇక, పెనమలూరు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వను అన్నారు. పెనమలూరు అసెంబ్లీని గెలిచి చంద్రబాబుకి కానుకగా ఇస్తాం అని ప్రకటించారు.. నామినేషన్ కార్యక్రమంలో కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు.. ఎన్నికల వరకు కార్యకర్తలు ఇదే స్ఫూర్తి కొనసాగించాలని కోరారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు బోడె ప్రసాద్.