Andhra Pradesh: ఏపీలో ఎన్నికల వేళ ఈసీకి ఫిర్యాదుల వెల్లువ.. పార్టీల పరస్పర ఫిర్యాదులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీలో ఎన్నికల వేళ.. ఈసీ వద్ద వివిధ పార్టీల ఫిర్యాదులతో పంచాయతీ నెలకొంది. ప్రతి ఎన్నికల్లోనూ ఉండే తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ ఒకరిపై ఒకరు ఈసీకి అధికార-ప్రతిపక్ష పార్టీలు పరస్పర కంప్లైంట్లు ఇచ్చుకుంటున్నారు. షెడ్యూల్ విడుదల కాక ముందు నుంచి వైసీపీ – టీడీపీ పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. చంద్రబాబు, పవన్ సహా ఇతర టీడీపీ నేతల కామెంట్లు, సోషల్ మీడియా ట్రోలింగ్స్‌పై వైసీపీ ఫిర్యాదులు చేస్తోంది. ఇప్పటి వరకు 150కు పైగా వైసీపీ ఫిర్యాదులు ఇచ్చింది. దొంగ ఓట్లు మొదలుకుని.. అధికార దుర్వినియోగం వరకు టీడీపీ వరుస ఫిర్యాదులు చేస్తోంది. దొంగ ఓట్ల వ్యవహరంలో ఐఏఎస్ సహా.. కొందరు అధికారుల సస్పెన్షన్ వరకు వ్యవహరం వెళ్లింది.
Read Also: Telangana Rains: చల్లబడిన వాతావరణం.. హైదరాబాదులో పలుచోట్ల భారీ వర్షం..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
వాలంటీర్లు మొదలుకుని సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ మీద టీడీపీ వరుస ఫిర్యాదులు చేసింది. కూటమి ఫిర్యాదులతో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఈసీ వేటు వేసింది. త్వరలో సీఎస్, డీజీపీలు కూడా బదిలీ అవుతారని ప్రచారం జరుగుతోంది. .జగన్ సహా మంత్రులు, ఇతర వైసీపీ నేతల కామెంట్లపై టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు 200కి పైగా టీడీపీ ఫిర్యాదులు చేసింది. ఫిర్యాదులపై ఎన్నికల సంఘం వివరణలు కోరుతోంది. సీఎస్, డీజీపీలపై వచ్చిన ఫిర్యాదులపై ఈసీ వివరణ తీసుకుంది. సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు వివరణ కోరుతూ ఈసీ కూడా వందకు పైగా నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!