NTV Telugu Site icon

Mahakumbh 2025: మహా కుంభమేళాలో ముస్లిం మహిళలు.. సీఎం యోగిపై పొగడ్తల వర్షం..

Mahakumbh

Mahakumbh

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం మహాకుంభమేళా. ఇది భారతీయ సంస్కృతి, సంప్రదాయాల సంగమం మాత్రమే కాదు.. ప్రపంచ ఐక్యతకు చిహ్నంగా కూడా మారింది. లక్షలాది మంది భక్తులతో పాటు, ప్రపంచంలోని వివిధ మూలల నుంచి విదేశీ ప్రతినిధులు కూడా ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.

READ MORE: PM Modi: “ఫోటోలు తీయండి, లొకేషన్ షేర్ చేయండి”.. ఆప్‌ని ఎండగట్టాలని ప్రధాని మోడీ ఆదేశం..

ఈసారి మహాకుంభమేళాకు 10 దేశాల నుంచి 21 మంది సభ్యుల అంతర్జాతీయ ప్రతినిధి బృందం హాజరైంది. వీరిలో ఫిజి, ఫిన్లాండ్, గయానా, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి ప్రతినిధులు ఉన్నారు. ఈ ప్రతినిధులు కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించి, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. సాధువుల ద్వారా భారతీయ ధార్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను తెలుసుకున్నారు.

READ MORE: KTR: వాళ్ల ప్రియారిటీ ఫార్ములా- ఈ కేస్.. మా ప్రియారిటీ ఫార్మర్స్

ప్రతినిధి బృందంలోని ప్రత్యేక సభ్యురాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ముస్లిం మహిళ సాలీ ఎల్ అజాబ్ మహాకుంభమేళా యొక్క గొప్ప ఏర్పాట్లను ముక్తకంఠంతో ప్రశంసించింది. “మిడిల్ ఈస్ట్ నుంచి భారతదేశానికి రాకముందు ఇలాంటి పెద్ద మత కార్యక్రమం నేను ఎప్పుడూ చూడలేదు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు.. ఇక్కడ ఏర్పాట్లు, భద్రత కూడా అపూర్వమైనది.” అని పేర్కొంది.

READ MORE: KTR: వాళ్ల ప్రియారిటీ ఫార్ములా- ఈ కేస్.. మా ప్రియారిటీ ఫార్మర్స్

మరోవైపు.. ముంబైకి చెందిన షబ్నమ్ షేక్ అనే ముస్లిం యువతి కూడా మహాకుంభమేళాకు చేరుకుంది. షబ్నం షేక్ ఇక్కడ చాలా మంది సాధువులను, మహాత్ములను సందర్శించి వారి ఆశీర్వాదం తీసుకుంది. దీనితో పాటు, ముస్లిం యువతి అనేక సనాతనీ ఆచారాలలో కూడా పాల్గొంది. యోగి ప్రభుత్వ ఏర్పాట్లను సాటిలేనిదిగా అభివర్ణించింది. ఆమె అయోధ్య పీఠాధీశ్వర్ జగత్గురు ఆచార్య పరమహంస్ దాస్ సన్యాసి శిబిరాన్ని కూడా సందర్శించింది.